రేపటి నుంచే ఏపీ ఎంసెట్-2020 పరీక్ష ప్రారంభం, హాజరయ్యే విద్యార్థులకు సూచనలు

AP Eamcet, AP Eamcet 2020 Exam, AP EAMCET 2020 exam date, ap eamcet 2020 latest news, AP EAMCET Exam 2020, AP EAMCET Exam News, AP EAMCET Exam Updates, AP Eamcet-2020 Exam Starts from Tomorrow, AP Eamcet-2020 Hall Tickets

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్‌-2020‌ పరీక్ష రేపటి నుండి ప్రారంభం కానుంది. ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష సెప్టెంబరు 17, 18, 21, 22, 23 తేదీల్లో, ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను సెప్టెంబ‌ర్ 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో జరిగే ఎంసెట్‌ పరీక్ష కోసం ఈ ఏడాది మొత్తం 2,72,900 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది. పరీక్షలను రెండు షిఫ్టుల్లో ఉద‌యం 9 గంటల నుంచి 12 గంటల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంట‌ల‌ వ‌ర‌కు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మరియు హైదరాబాద్‌ నగరంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 47 పట్టణాల్లో 118 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఎంసెట్ పరీక్షను కాకినాడ జేఎన్టీయూ నిర్వహిస్తుంది.

ఎంసెట్-2020 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు సూచనలు:

  • ఈ–హాల్‌ టికెట్‌ మరియు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారాన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారాన్ని నింపి సమర్పించాలి.
  • ఫోటోతో కూడిన అధికారిక గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలి.
  • పరీక్షకు హాజరయ్యే విద్యార్థులంతా కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
  • పరీక్షా కేంద్రంలోకి గంటన్నర ముందే అనుమతిస్తారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి ఉండదు. అలాగే పరీక్ష సమయం పూర్తయ్యే వరకు బయటకు పంపించరు.
  • మాస్కు, గ్లోవ్స్, వ్యక్తిగత ట్రాన్ఫరెంట్ వాటర్‌ బాటిల్, 50 ఎంఎల్‌ శానిటైజర్, బాల్ పాయింట్ పెన్, అడ్మిట్ కార్డు, ఐడి కార్డును మాత్రమే లోపలకు అనుమతిస్తారు.
  • పరీక్షా కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించాలి.
  • కరోనా లక్షణాలు కలిగి ఉన్న విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో ఉంచి పరీక్ష రాయించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here