హైదరాబాద్ నాంపల్లిలో.. రేపటి నుంచి ‘నూమాయిష్‌’ ఎగ్జిబిషన్‌ పునఃప్రారంభం

Hyderabad's Numaish Exhibition Set To Resumes From Tomorrow, Hyderabad's Numaish Exhibition, Hyderabad's Numaish Exhibition Set To Resumes, All India Industrial Exhibition, All India Industrial Exhibition is likely to Resumes From Tomorrow, All India Industrial Exhibition Likely To Resumes From Tomorrow, All India Industrial Exhibition’s organizers are planning to Resumes From Tomorrow, annual fair of Hyderabad, Hyderabad Numaish Fair 2022, Hyderabad Numaish Fair 2022 Likely To Resumes From Tomorrow, Numaish 2022, Hyderabad's Numaish Exhibition 2022, Numaish 2022 Likely To Resume In February, Numaish Fair, Numaish Fair 2022, Numaish Fair 2022 Likely To Resumes From Tomorrow, Numaish Fair Likely To Resumes From Tomorrow, Mango News, Mango News Telugu,

హైదరాబాద్ నాంపల్లిలో నూతన సంవత్సరం రోజున ఘనంగా ఆరంభమైన ‘నూమాయిష్‌’ ఎగ్జిబిషన్‌ రెండు రోజులకే మూతపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దేశంలో, రాష్ట్రంలో కరోనా మూడోదశ వ్యాప్తి.. ఒమిక్రాన్ భయం.. వీటివలన అర్ధాంతరంగా ఎగ్జిబిషన్‌ను నిలిపివేశారు. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన నేపథ్యంలో పునఃప్రారంభయానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రేపటినుంచి మళ్ళీ యధావిధిగా స్టాల్స్ ఓపెన్ అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్టాళ్లతో పాటుగా కశ్మీర్‌ ఉత్పత్తులకు, చేనేత ఉత్పత్తులకు నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ చాలా ప్రత్యేకం.

46 రోజులపాటు జరుగనున్న ఈ ఎగ్జిబిషన్‌ ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు జరుగనుంది. వారాంతాల్లో మాత్రం రాత్రి 11 గంటల వరకు కొనసాగనుంది. సుమారు 1600 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నూమాయిష్‌ యాజమాన్యం తెలిపింది. అయితే, కోవిడ్ దృష్ట్యా నిబంధనలు అమలు చేయనున్నారు. మాస్కులు ధరించటం, థర్మల్‌ స్క్రీనింగ్ చేసిన తర్వాతే సందర్శకులను లోపలికి రావటానికి అనుమతి ఇవ్వనున్నారు. అలాగే, ఎగ్జిబిషన్‌ జరిగే మొత్తం ప్రాంగణాన్ని ప్రతిరోజూ శానిటైజ్ చేస్తామని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =