నేటి నుంచే బ‌యో ఏషియా-2022 స‌ద‌స్సు, ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

Minister KTR to Inaugurate Bioasia-2022 Virtual Conference Today, Minister KTR to Inaugurate Bioasia-2022 Virtual Conference, Minister KTR to Inaugurate Bioasia-2022, Minister KTR Virtual Conference, Bioasia-2022, 2022 Bioasia, Minister KTR, KTR to inaugurate BioAsia 2022, Telangana Minister for Industries and Commerce KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao, Telangana Minister KTR, Telangana Minister KTR Inaugurate Bioasia-2022, BioAsia Summit 2022, 2022 BioAsia Summit, Telangana Minister KTR to Inaugurate Bioasia-2022 By Virtual Conference, BioAsia 2022 to be held virtually on Feb 24 and 25, Mango News, Mango News Telugu,

హైదరాబాద్ నగరం వేదికగా నేటి నుంచే బ‌యో ఏషియా-2022 స‌ద‌స్సు జరగనుంది. రెండు రోజుల పాటుగా వ‌ర్చువ‌ల్ విధానంలో జరగనున్న ఈ సదస్సును రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 24, గురువారం నాడు ప్రారంభించనున్నారు. ఈ 19వ ఎడిషన్ బయో ఏషియా సదస్సును ఈసారి “ఫ్యూచర్ రెడీ” థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఈ స‌ద‌స్సులో ప్రపంచంలోని 70కు పైగా దేశాల నుంచి జీవ‌శాస్త్ర నిపుణులు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీల ప్ర‌తినిధులు పాల్గొని ఫార్మా, ఆరోగ్య రంగాల అభివృద్ధి, పరిశోధనలపై చర్చించనున్నారు.

మొదటి రోజైన గురువారం నాడు కోవిడ్-19 మహమ్మారి, గత రెండేళ్లలో నేర్చుకున్న అంశాలు, అభివృద్ధి చెందుతున్న హెల్త్ కేర్ ట్రెండ్స్ మరియు ప్రపంచ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏం చేయొచ్చు అనే అంశాలపై జరిగే ఫైర్ సైడ్ ఛాట్ లో మంత్రి కేటీఆర్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్‌, తదితరుల మధ్య కీలక చర్చ జరగనుంది. అలాగే రెండో రోజైన శుక్రవారం నాడు ఫార్మా రంగం అభివృద్ధి, ఇతర అవకాశాలను అందిపుచ్చుకోవడం వంటి అంశాలపై చర్చ జరుగనుంది

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =