తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్ ప్రమాణ స్వీకారం, హాజరైన సీఎం కేసీఆర్

Justice Ujjal Bhuyan Sworn-in as Chief Justice of Telangana High Court at Raj Bhavan CM KCR Attends, CM KCR Attends Justice Ujjal Bhuyan Sworn-in as Chief Justice of Telangana High Court at Raj Bhavan, Justice Ujjal Bhuyan Sworn-in as Chief Justice of Telangana High Court at Raj Bhavan, Justice Ujjal Bhuyan Sworn-in as CJ of Telangana High Court, Chief Justice of Telangana High Court, CJ of Telangana High Court, Raj Bhavan, Telangana Justice Ujjal Bhuyan Takes Oath As Chief Justice Of Telangana, Justice Ujjal Bhuyan Takes Oath As Chief Justice Of Telangana, Ujjal Bhuyan Takes Oath As Chief Justice Of Telangana, Chief Justice Of Telangana, Telangana Chief Justice, Telangana Justice Ujjal Bhuyan, Justice Ujjal Bhuyan, Ujjal Bhuyan, Justice Ujjal Bhuyan took oath as the Chief Justice of Telangana on the 28th of June CM KCR, Mango News, Mango News Telugu,

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్ మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భ‌వ‌న్ ‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్ చేత రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర‌రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పలువురు న్యాయమూర్తులు, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జీహెఛ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి గద్వాల్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారం అనంతరం జ‌స్టిస్ ఉజ్జల్‌ భూయాన్ కి గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలియజేశారు. ముందుగా ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ అయ్యారు. దీంతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు సీజేగా సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. అనంతరం ఈ నియామక సిఫార్సుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంతో తెలంగాణ హైకోర్టు సీజేగా ఉజ్జల్‌ భూయాన్‌ నియామకంపై కేంద్ర న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది.

అస్సాం రాష్ట్రానికి చెందిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ గువాహటిలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్‌ఎల్‌బీ, గువాహటీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1991లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ చేసుకుని వృత్తి జీవితం ప్రారంభించారు. 2011లో గువాహటి హైకోర్టులో అదనపు ఏజీగా నియమితులైన ఆయన, అక్టోబర్ 17, 2011న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. ఇక అక్టోబర్ 3, 2019న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ బదిలీ అయ్యారు. అనంతరం అక్టోబర్‌ 22, 2021న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. ఈ నేపథ్యంలోనే పదోన్నతిపై జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్ నేడు హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 11 =