ప్రముఖ బిజినెస్‌ టైకూన్‌ ‘షాపూర్జీ పల్లోంజీ’ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

India Billionaire Industrialist and Shapoorji Pallonji Group Chairman Pallonji Mistry Passes Away, Shapoorji Pallonji Group Chairman Pallonji Mistry Passes Away, India Billionaire Industrialist Pallonji Mistry Passes Away, Pallonji Mistry Passes Away, Pallonji Mistry Passed Away, India Billionaire Industrialist Passes Away, Shapoorji Pallonji Group Chairman Passes Away, Shapoorji Pallonji Group Chairman Pallonji Mistry, India Billionaire Industrialist Pallonji Mistry, Pallonji Mistry, India Billionaire Industrialist, Shapoorji Pallonji Group Chairman, Pallonji Mistry Is No More, India Billionaire, Mango News, Mango News Telugu,

దేశీయ దిగ్గజ పారిశ్రామికవేత్త మరియు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూశారు. 93 సంవత్సరాల మిస్త్రీ ముంబైలోని తన నివాసంలో సోమవారం తుది శ్వాస విడిచారు. షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 18 ప్రధాన కంపెనీలతో కూడిన ప్రపంచవ్యాప్త సంస్థ మరియు భారతదేశంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం జూన్ 28, 2022 నాటికి పల్లోంజీ దేశంలో అత్యంత ధనవంతుడు. పల్లోంజీ మిస్త్రీ నికర ఆస్తుల విలువ 28.90 బిలియన్ డాలర్లు. 1929లో గుజరాత్‌లోని ఒక పార్సీ కుటుంబంలో జన్మించిన మిస్త్రీ లండన్‌ లోని ఇంపీరియల్ కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించారు. చిన్న వయస్సులోనే కుటుంబానికి చెందిన వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చారు.

వ్యాపార రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించింది. దాదాపు 160 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంస్థను 1865లో స్థాపించారు. ఈ కంపెనీ రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌, ఇంజనీరింగ్ నిర్మాణం వంటి రంగాలలో సర్వీస్‌ అందిస్తోంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్, పల్లోంజీ మిస్త్రీ ఆధ్వర్యంలో ముంబైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం సహా కొన్ని ఐకానిక్ నిర్మాణాలను నిర్మించింది. 1970 దశకంలో ఈ కంపెనీ సుల్తాన్ ఆఫ్ ఒమన్ రాజభవనాన్ని నిర్మించడం ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఆ తర్వాత అనేక దేశాలకు ఇది విస్తరించింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం, హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్ భవనాల నిర్మాణం షాపూర్జీ పల్లోంజీ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఇక 2004లో తన పెద్ద కుమారుడు షాపూర్ మిస్త్రీని తమ సంతలకు ఛైర్మన్‌గా నియమించారు పల్లోంజీ మిస్త్రీ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 11 =