గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ కన్నుమూత

breaking news, Former CM Of Gujarat Keshubhai, Former CM Of Gujarat Keshubhai Patel, Former CM Of Gujarat Keshubhai Patel Passes Away, Former Gujarat chief minister Keshubhai Patel, Gujarat Keshubhai, Gujarat Keshubhai Patel Passes Away, National News

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేశూభాయ్ పటేల్ ఆర్‌ఎస్‌ఎస్‌ లో ప్రచారక్‌గా చేరి, అనంతరం జన్‌సంఘ్‌ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రానికి ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ముందుగా బీజేపీ తరపున 1995 లో కొన్ని నెలలు పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేయగా, ఆ తరవాత 1998 నుంచి 2001 వరకు‌ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో బీజేపీని వీడి గుజరాత్ పరివర్థన్‌ పార్టీని స్థాపించారు. అయితే తరువాత ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. కేశుభాయ్ పటేల్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సహా పలు పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 8 =