నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో కల్వకుంట్ల కవిత ఘనవిజయం

Former MP Kalvakuntla Kavita, Former MP Kalvakuntla Kavita win Nizamabad MLC, Kalvakuntla Kavita win Nizamabad MLC, Kalvakuntla Kavitha, Kalvakuntla Kavitha Wins Nizamabad MLC By-election, Nizamabad Local Body Elections, nizamabad mlc by election, nizamabad mlc election, Nizamabad MLC Elections, Nizamabad MLC Polls, Nizamabad News, Nizamabad Political Updates

నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీకి జరిగిన ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ విజయాన్ని కైవసం చేసుకుంది. టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. మొత్తం 823 ఓట్లు పోల్ అవగా, టిఆర్ఎస్ పార్టీ 728 ఓట్లు, బీజేపీ 56, కాంగ్రెస్ 29 ఓట్లు దక్కించుకున్నాయి. అలాగే 10 ఓట్లు చెల్లలేదని అధికారులు పేర్కొన్నారు. ముందుగా ఊహించిన విధంగానే కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో విజయం సాధించడంతో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here