గాంధీభవన్‌లో దిగ్విజయ్‌ సింగ్‌తో టీ-కాంగ్రెస్ నేతల భేటీ.. పీసీసీ పదవులు, పార్టీలో అంతర్గత కలహాలపై కీలక చర్చ

T-Congress Crisis Several Leaders Meets Senior Digvijay Singh in Gandhi Bhavan Today,High Command T-Congress Crisis,Digvijay Singh To Solve Problem,T-Congress Crisis,Mango News,Mango News Telugu,Telangana Mla Seethakka,T-Congress Leaders Resigned Pcc Posts,T-Congress Pcc Posts,T-Congress Crisis,12 Leaders Resigns From Pcc Posts,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Trs Party,Trs Latest News And Updates,Brs Party News And Live Updates,Election Commision Of India,Telangana Brs Party,Trs Party News

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవుల నియామకం విషయంలో మొదలైన రగడకు నేటితో ముగింపు పడనుందా? పార్టీలో చీలికకు కారణమైన సమస్యకు పరిష్కారం దొరకనుందా? గురువారం గాంధీభవన్‌లో టీ-కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌ సింగ్‌తో భేటీ నేపథ్యంలో ఈ ప్రశ్నలకు సమాధానం లభించనుంది. ఈ క్రమంలో టీ-కాంగ్రెస్ అసంతృప్త నేతలు ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రి దామోదర రాజ నర్సింహా, మాజీ ఎంపీ వీహెచ్‌ హనుమంత రావు తదితరులు భేటీ అయిన వారిలో ఉన్నారు. పార్టీలో పరిణామాలపై వారి దిగ్విజయ్‌ సింగ్‌కు వివరించినట్లు సమాచారం. ఇక ఒక్కో నేతకు సుమారు 15 నిముషాలు సమయం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

తొలుత ముందు పీఏసీ కమిటీతో సమావేశమైన ఆయన, అనంతరం అసంతృప్త నేతలతో మీటింగ్‌ నిర్వహిస్తున్నారు. అందరి వాదనలు, అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దిగ్విజయ్‌ సింగ్‌ ఈ వ్యవహారానికి సంబంధించి పార్టీ అధిష్టానానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. కాగా గత కొన్ని రోజులుగా టీ-కాంగ్రెస్ నేతలు సీనియర్లు-జూనియర్లుగా విడిపోయి కలహించుకుంటున్న సంగతి తెలిసిందే. పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరిగిందని, తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కొంతమంది సీనియర్ నేతలు ఇటీవల బహిరంగంగా విమర్శలు చేయడం సంచలనం రేపింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పదవులు దక్కాయని, తమకు కనీసం నియామకాల గురించి కూడా తెలియదని వారు మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై కూడా వారు పలు ఆరోపణలు చేశారు.

అయితే సీనియర్ల ఆరోపణలకు రేవంత్ రెడ్డి వర్గం సభ్యులు ఘాటుగా బదులిచ్చారు. పార్టీకి నష్టం చేసేలా సీనియర్లు ప్రవర్తిస్తున్నారని, రేవంత్ రెడ్డిని అణగదొక్కడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే సీతక్క సహా మొతం 12మంది నేతలు తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో స్పందించిన అధిష్టానం సమస్యను పరిష్కరించడానికి ట్రబుల్ షూటర్ దిగ్విజయ్‌ సింగ్‌ను రాష్ట్రానికి పంపింది. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో పార్టీ బలోపేతం కోసం అధిష్టానం అడుగులు వేస్తోంది. అయితే దీనికి ముందుగా పార్టీలోని అంతర్గత సమస్యలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో దిగ్విజయ్‌ సింగ్‌ పలువురు నేతలతో ముఖాముఖీ భేటీ అవుతుండటంతో సర్వత్రా ఆసక్తిగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here