హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత

Actor Venu Madhav Passed Away, Comedian Venu Madhav, Comedian Venu Madhav Died, Comedian Venu Madhav Passed Away, latest breaking news, Latest Tollywood Updates 2019, Mango News Telugu, Tollywood Actor Venu Madhav Passed Away, Tollywood Breaking News, Tollywood Comedian Venu Madhav Passed Away, Venu Madhav Is No More, Venu Madhav Passed Away

ప్రముఖ తెలుగు హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు, కిడ్నీ సమస్యలు కూడ తలెత్తడంతో కుటుంబసభ్యులు ఈ నెల 6వ తేదీన యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం నాడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ సాయంతో వేణుమాధవ్ కు వైద్యులు చికిత్స అందిచారు. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో బుధవారం మధ్యాహ్నం 12.21 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. వేణుమాధవ్ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకుంది. పలువురు సినీ ప్రముఖులు వేణుమాధవ్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

వేణుమాధవ్ ప్రస్థానం:

 • తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడలో 1979 డిసెంబర్ 30న జన్మించారు
 • తొలుత మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించారు
 • 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన సంప్రదాయం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు
 • పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన తొలిప్రేమ సినిమాతో ఇండస్ట్రీలో మంచి బ్రేక్ లభించింది
 • తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి టాప్ కమెడియన్ గా ఎదిగారు
 • ప్రత్యేక స్లాంగ్, బాడీ లాంగ్వేజ్ తో చేసిన ప్రతి పాత్రలోనూ తనదైన ముద్రవేస్తూ ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు
 • దిల్, లక్ష్మి, సింహాద్రి, సై, ఛత్రపతి, వెంకీ, మాస్, జై చిరంజీవా లాంటి అనేక చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు కమెడియన్‌గా మంచిపేరు తీసుకొచ్చాయి
 • నటుడిగా పరిచయం చేసినా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోనే హంగామా సినిమాతో హీరోగా మారారు
 • భూకైలాస్, ప్రేమాభిషేకం వంటి పలు సినిమాల్లో హీరోగా నటించారు
 • కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడ వ్యవహరించారు
 • వి.వి.వినాయక్ దర్శకత్వంలో నటించిన లక్ష్మి సినిమాకుగాను ఉత్తమ హాస్యనటుడిగా వేణుమాదవ్ నంది అవార్డు అందుకున్నారు.
 • గత కొంతకాలంగా కాలేయం, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు
 • ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో సెప్టెంబర్ 25, మధ్యాహ్నం 12.21 గంటలకు కన్నుమూశారు.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here