‘మా’ ఎన్నికలు : నామినేషన్ దాఖలు చేసిన నటుడు ప్రకాశ్‌ రాజ్‌

#MAAElections, Actor Prakash Raj and his Panel Members Filed Nomination Today, Actor Prakash Raj files his nomination, Bandla files nomination, MAA Election, MAA Elections, MAA Elections 2021, MAA Elections News, Mango News, Movie Artists Association polls, Prakash Raj, Prakash Raj hints at outcome post Pawan Kalyan’s speech, Tollywood’s MAA elections, Vishnu Manchu
  • మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10, ఆదివారం నాడు జరగనున్న విషయం తెలిసిందే. ‘మా’ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా, తాజాగా నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న ప్రకాశ్‌ రాజ్‌ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ కు ప్రకాశ్ రాజ్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ప్రకాశ్ రాజ్ తో పాటుగా తన ప్యానల్‌ సభ్యులు కూడా నామినేషన్స్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, ‘మా’ సభ్యుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఈ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు తెలిపారు. ‘మా’ అభివృద్ధి కోసం తయారుచేసుకున్న ప్రణాళికను అక్టోబర్ 3న వెల్లడించనున్నట్టు ప్రకటించారు.

మరోవైపు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ ప్రముఖ నటుడు సీవీఎల్‌ నరసింహారావు కూడా ఈ రోజే నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక ఎన్నికల బరిలో నిలిచిన నటుడు మంచు విష్ణు సెప్టెంబర్‌ 28 న మధ్యాహ్నాం నామినేషన్‌ దాఖలు చేయనున్నట్టు తెలుస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం ఈ ఎన్నికలకు సెప్టెంబర్ 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 30న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, అక్టోబర్‌ 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువిచ్చారు. అక్టోబర్ 2వ సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఇక అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ‘మా’ ఎన్నికలను నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =