ఆ నియోజకవర్గంలో ఒకే సామాజికవర్గానికి చెందిన ముగ్గురు

Three of them belong to the same social group in that constituency,Three of them belong to the same,same social group in that constituency,Mango News,Mango News Telugu,vote, constituency,Gangula Kamalakar, BRS Party, Bandi Sanjay, BJP, Puramalla Srinivas,Congress Party,Telangana Assembly Elections 2023,Gangula Kamalakar Latest News,Gangula Kamalakar Latest Updates,BRS Party Latest News,BRS Party Latest Updates
vote, constituency,Gangula Kamalakar, BRS Party, Bandi Sanjay, BJP, Puramalla Srinivas,Congress Party,Telangana Assembly Elections 2023,

తెలంగాణలో శాసన సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. కళ్లు మూసి కళ్లు తెరిచేలోగా రోజు గడిచిపోతుందని.. ప్రచారాలకు  సమయం  సరిపోవడం లేదని నేతలంతా గోల పెడుతున్నారు. దీంతో రోజుకు 3,4 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బహిరంగ సభలు నిర్వహించడం, ముఖ్య  నేతలరతో ఓటర్లను ఆకట్టుకునేలా చేయడం వంటివి చేస్తూ..ప్రధాన పార్టీలన్నీ దూకుడును పెంచాయి.నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగియడంతో  ఫోకస్ అంతా ప్రచారంపైనే పెట్టారు.

మరి కొద్ది రోజుల్లోనే పోలింగ్ ఉండటంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.ముఖ్యంగా తమ తమ సామాజిక వర్గాల ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి.అయితే కరీంనగర్ నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులలో ఎవరికి ఓటు వేయాలో తెలియక సతమతమవుతున్నారట అక్కడి ఓటర్లు.  దీంతో ప్రస్తుతం కరీంనగర్ నియోజకవర్గం అభ్యర్ధుల విషయం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మూడు ప్రధాన పార్టీలు కూడా  ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులను బరిలోకి దింపడం ఆసక్తికరంగా మారింది.

కరీంనగర్ నియోజకవర్గంలో బాగా పట్టున్న సామాజిక వర్గం ఏదని అంటే అది మున్నూరు కాపునే. అందుకే మున్నూరు కాపు సామాజికవర్గంవైపే ప్రధాన పార్టీలన్నీ మొగ్గు చూపాయి. అందుకే బీఆర్ఎస్  పార్టీ తరఫున గంగుల కమలాకర్, భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ నుంచి పురమల్ల శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థి అయిన  గంగుల కమలాకర్ ఇప్పటి వరకు కరీంనగర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచి.. ఇప్పుడు నాలుగోసారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.  బీజేపీ నుంచి బండి సంజయ్ గతంలో రెండుసార్లు కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయి మరోసారి బరిలోకి దిగుతున్నారు.ఇక కాంగ్రెస్ అభ్యర్ధి అయిన పురమల్ల శ్రీనివాస్ తొలిసారిగా కరీంనగర్ నుంచి బరిలో దిగుతున్నారు.

మరోవైపు కరీంనగర్ నియోజకవర్గంలో 3.40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఇక్కడ మున్నూరు కాపు, ముస్లీం ఓటర్లే కీలకం కానున్నారు. మరి ఇప్పుడు ఒకే సామాజిక వర్గం నుంచి ముగ్గురు నిలబడటంతో ఏ ఓటర్ ఎటు మొగ్గుతాడో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − seven =