కాంగ్రెస్ సర్కార్ ఏర్పడక ముందే సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్

Rajasingh Made Sensational Comments Before The Formation Of The Congress Government,Rajasingh Made Sensational Comments,Before The Formation Of The Congress Government,Rajasingh Sensational Comments,Rajasingh, Revanth Reddy, Congress, BJP, Telangana Politics,Mango News,Mango News Telugu,MLA Raja Singh,Goshamahal Election Result,Telangana Latest News,Telangana Latest Updates,Rajasingh News Today,Rajasingh Latest Updates
Rajasingh, Revanth Reddy, Congress, BJP, Telangana Politics

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సంపూర్ణ మెజార్టీతో కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టారు. మరికొద్దిగంటల్లో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరబోతోంది. రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. గురువారం రేవంత్ రెడ్డితో పాటు ఎనిమిది మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్న వేళ.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ఒక్క ఏడాది మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్న రాజాసింగ్.. ఆ తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ అప్పుల కుప్పగా తెలంగాణను మార్చారని భగ్గుమన్నారు. ఆ అప్పులను, లెక్కలను సరిజేసేందుకు కాంగ్రెస్‌కు సమయం సరిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలే కట్టలేకపోతున్నారన్న రాజాసింగ్.. పథకాల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని నిలదీశారు.

తెలంగాణకు అప్పులు ఇవ్వాలంటేనే బ్యాంకులు బయపడిపోతున్నాయని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడపలేదన్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని నడపడం ఒక్క బీజేపీతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. బీజేపీ వస్తేనే తెలంగాణకు తిరిగి పూర్వవైభవం వస్తుందన్నారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని.. ఏడిది తర్వాత తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + eleven =