కరోనా వైరస్ వల్ల మరణాలు జరగకుండా చూద్దాం, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి ఈటల

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Etela Rajender, Etela Rajender held Teleconference with Hospital Superintendents, Etela Rajender held Teleconference with Hospital Superintendents over Covid-19, Health Minister Etela Rajender, Mango News, minister etela rajender, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Health Minister, Telangana Health Minister Etela Rajender, Total COVID 19 Cases

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టర్శరీ కేర్ హాస్పిటల్స్, టీవీవీపీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో వైద్య ఆరోగ్య శాఖ సెక్రెటరీ రీజ్వి, డీఎంఈ రమేష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఇది గంభీరమైన సమయమని, రిలాక్స్ కావొద్దని అన్నారు. మరోసారి యుద్ద వాతావరణంలో పని చేద్దాం. కరోనా వైరస్ వల్ల మరణాలు జరగకుండా చూద్దామని అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లని మంత్రి కోరారు. అన్ని ఆసుపత్రుల్లో పీపీఈ కిట్స్, రిమెడ్స్విర్ ఇంజెక్షన్లు, N95 మాస్క్ లు, లిక్విడ్ ఆక్సిజన్ టాంక్ లు, బల్క్ సిలెండర్ లు, టాబ్లెట్స్, డాక్టర్ లు, సిబ్బంది, బెడ్స్ కొరత లేకుండా చూడాలని చెప్పారు. ఎంత మంది సిబ్బంది అవసరం అయినా తాత్కాలిక పద్దతిలో తీసుకోండి అని మంత్రి సూచించారు.

వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వారందరూ సెలవులు పెట్టకండి:

ఆ తరువాత జిల్లా వైద్య అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ కూడా ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. డీఎం అండ్ హెచ్‌వోలతో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో గ్రామస్థాయిలో పని చేస్తున్న వైద్య సిబ్బంది ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గ్రామాల్లో జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరినీ, ప్రతి రోజూ పరిశీలన చేయండి. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వారందరూ సెలవులు పెట్టకండి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదివారం కూడా వాక్సిన్ వేయాలని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అందరూ అన్ని రోజులు పని చేయండి. ప్రజా జీవనం యదావిధంగా కొనసాగిస్తూనే కరోనా నియంత్రణ చేయాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న అన్ని జిల్లాల వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీ మాట్లాడుతూ, వాక్సిన్ కొరత లేదు, అందరికీ వాక్సిన్ అందుతుంది. 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వాక్సిన్ సెంటర్ కి పంపించాలి. ఆర్టీ- పీసీఆర్ పరీక్షల సంఖ్య పెంచాలి. ప్రతి జిల్లాకు ఇచ్చిన టార్గెట్ మేరకు చేయాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 3 =