కరీంనగర్‌లో దళితబంధు యూనిట్లను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్‌

Minister Gangula Kamalakar Inaugurates Dalitha Bandhu Units in Karimnagar Today, Telangana Minister Gangula Kamalakar Inaugurates Dalitha Bandhu Units in Karimnagar Today, Gangula Kamalakar Inaugurates Dalitha Bandhu Units in Karimnagar Today, Gangula Kamalakar Launches Dalitha Bandhu Units in Karimnagar Today, Gangula Kamalakar Inaugurated Dalitha Bandhu Units in Karimnagar Today, Telangana Minister Gangula Kamalakar Starts Dalitha Bandhu Units in Karimnagar Today, Dalitha Bandhu Units in Karimnagar, Dalitha Bandhu Units, Karimnagar Dalitha Bandhu Units, Minister of BC Welfare, Telangana BC Welfare Minister Gangula Kamalakar, BC Welfare Minister Gangula Kamalakar, Minister Gangula Kamalakar, Karimnagar Dalitha Bandhu Units News, Karimnagar Dalitha Bandhu Units Latest News, Karimnagar Dalitha Bandhu Units Latest Updates, Karimnagar Dalitha Bandhu Units Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కరీంనగర్‌లో పలు దళితబంధు యూనిట్లను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని కిసాన్‌ నగర్‌, రేకుర్తి గ్రామంలో శనివారం దళితబంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకం రూపకల్పన చేశారని పేర్కొన్నారు. దళితబంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్లను సక్రమంగా నడిపించుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధించాలని, అలాగే ఈ పథకం ద్వారా తమ కాళ్లపై తాము నిలబడడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పించేలా ఆర్థికంగా ఎదగాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా దళితబంధు పథకం ద్వారా లబ్దిపొందిన వారితో గంగుల యూనిట్ల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో యూనిట్ల పనితీరును సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షిస్తారని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 13,559 మంది లబ్ధిదారులకు గాను 11,500 మందికి పథకం కింద సహాయం చేసినట్లు తెలిపారు. అలాగే కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో 300 మంది లబ్ధిదారులు ఎంపికవగా, వారిలో 250 మందికి యూనిట్లు మంజూరు చేశామని మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, జిల్లా కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 11 =