ఇకపై ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలి – తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

Telangana School Education Department Orders For Teachers Should Submit Their Assets Yearly, School Education Department Orders For Teachers Should Submit Their Assets Yearly, TS School Education Department Orders For Teachers Should Submit Their Assets Yearly, Teachers Should Submit Their Assets Yearly, Submit Their Assets Yearly, Teachers Assets, Telangana School Education Department, School Education Department, TS School Education Department, Teachers, Teachers Assets News, Teachers Assets Latest News, Teachers Assets Latest Updates, Teachers Assets Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా విద్యాశాఖ అనుమతి తప్పసరి చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించి తెలంగాణ విద్యా శాఖ శనివారం నూతన మార్గదర్శకాల్ని విడుదల చేసింది. దీని ప్రకారం ఇకపై తెలంగాణలో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం ఆస్తి వివరాలు సమర్పించాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ఉపాధ్యాయ వర్గాల నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే దీనిపై ప్రభుత్వ వర్గాల వాదన వేరుగా ఉంది. కొందరు ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో పాటు, ఇతర మార్గాల్లో ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై తెలంగాణ విద్యాశాఖ దృష్టి పెట్టింది. వీటికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికొచ్చినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. తాజా ఆదేశాల ప్రకారం.. ఇకపై ఉపాధ్యాయులు ఎక్కడైనా స్థిర, చర ఆస్తులు అమ్మినా, కొన్నా తెలంగాణ విద్యాశాఖకు తెలియజేసి, అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై టీచర్లు, ఉద్యోగులకు తగిన సూచనలు ఇవ్వాలని ఆర్‌జేడీ, డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − five =