రాష్ట్రంలో ఒకేసారి 44 ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్‌ మిషన్లను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao Inaugurates of 56 TIFFA Scan Machines at a Time in 44 Health Facilities in the State,Minister Harish Rao,56 Tifa scanning Machines in 44 hospitals,Telangana state,56 Tifa scanning Machines in Telangana,Mango news,mango news telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శనివారం రాష్ట్రంలో ఒకేసారి 44 ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్‌ మిషన్లను ప్రారంభించారు. హైదరాబాద్‌ లోని పేట్ల బురుజు ఆసుపత్రి వేదికగా వర్చువల్‌ విధానంలో మంత్రి హరీశ్‌రావు ఈ టిఫా స్కానింగ్ మిషన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, పేట్ల బురుజు ఆసుపత్రిలోనే సీఎం కేసీఆర్ గతంలో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. గర్భిణుల సౌకర్యార్థం రూ.20 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 44 ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్తగా 56 టిఫా స్కానింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ టిఫా యంత్రాల సాయంతో నెలకు 20వేల మంది గర్భిణులకు స్కానింగ్ చేసే వెసులుబాటు కలుగుతుందన్నారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ స్కానింగ్ కోసం రూ.2000 నుంచి రూ.3000 వరకు ఖర్చు కానుండగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగానే చేయనున్నట్టు తెలిపారు. ఈ స్కానింగ్ సహాయంతో గర్భంలోని బిడ్డకు ఉన్న లోపాలను ముందుగానే గుర్తించవచ్చని, అనంతరం అవసరమైన వైద్య సహాయం అందించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, వైద్యరోగ్య శాఖ అధికారులు, పేట్ల బురుజు ఆసుపత్రి సూపరెండెంట్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =