తెలంగాణ: డ్రగ్స్ కేసులో సీఎస్‌ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు హైకోర్టు నోటీసులు

Telangana High Court Issues Notices To CS and Excise Director in Drugs Case, Telangana High Court Issues Notices To Excise Director in Drugs Case, Telangana High Court Issues Notices To Telangana CS in Drugs Case Telangana High Court Issues Notices To Telangana CS, Telangana High Court Issues Notices To Excise Director, Excise Director in Drugs Case, Telangana CS in Drugs Case Telangana High Court, High Court, TS HC, Telangana Drugs case, Telangana Drugs case Latest News, Telangana Drugs case Latest Updates, Telangana Drugs case Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో ఈడీ వేసిన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా.. నిందితుల కాల్ డేటా, డిజిటల్ రికార్డులు సంబంధిత అధికారులు ఇవ్వట్లేదని ఈడీ కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ విషయంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించట్లేదని, కావున బాధ్యులైన వారికి కోర్టు ధిక్కరణ శిక్ష విధించాలని హైకోర్టుకు విన్నవించింది. ఈడీ వాదనలు విన్న అనంతరం, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటు ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వారిరువురూ ఈ విషయంపై 10 రోజుల్లో కోర్టుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్​పై విచారణను ఈనెల 25కు వాయిదా కోర్టు వేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + eleven =