మహిళల ఆరోగ్యం కోసం వినూత్నంగా ‘రుతు ప్రేమ’ కార్య‌క్ర‌మం.. సిద్దిపేటలో ప్రారంభించిన మంత్రి హ‌రీష్ ‌రావు

Minister Harish Rao Inaugurates Ruthu Prema For Women's Health in Siddipet, Minister Harish Rao Inaugurates Ruthu Prema For Women's Health, Ruthu Prema For Women's Health in Siddipet, Minister Harish Rao, Telangana health minister Harish Rao, health minister Harish Rao, T Harish Rao, Minister of Finance of Telangana, T Harish Rao Minister of Finance of Telangana, Telangana Finance Minister, Telangana health minister, Ruthu Prema For Women's Health, Women's Health, Ruthu Prema, Ruthu Prema Latest News, Ruthu Prema Latest Updates, Ruthu Prema Live Updates, Mango News, Mango News Telugu,

మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ‘రుతు ప్రేమ’ అనే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ ‌రావు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2021’లో జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల్లోనే మొదటి స్థానంలో నిలిచిన సిద్ధిపేట మున్సిపాలిటీ తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి నాంది పలికింది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా.. పట్టణంలోని ప్రతి మహిళకు నెలసరి సమయంలో అవసరమైన రుతుస్రావ కప్పులు, శానిటరీ ప్యాడ్లను అందించనున్నారు. అలాగే కౌమార దశలో ఉండే చిన్న పిల్ల‌ల‌కు క్లోత్ డైప‌ర్ల‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ సరికొత్త కార్యక్రమం అమలులో సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి నియోజకవర్గం అంతటా అమలు చేయటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఈరోజు సిద్దిపేట‌లోని ఐదో వార్డులో మంత్రి హ‌రీష్ ‌రావు బుధ‌వారం ప్రారంభించి పట్టణంలోని మహిళలకు, టీనేజర్లకు రుతుస్రావ క‌ప్పులు, శానిటరీ ప్యాడ్స్ అందించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. క్లోత్ ప్యాడ్స్ వాడటంలో సిద్దిపేట ఆదర్శంగా నిలవాల‌న్నారు. రుతుస్రావం గురించి ఇలా పబ్లిక్ గా మాట్లాడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, దీనిపై ప్రతి ఒక్కరిలో అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌తి నెలా రుతుస్రావ ప్ర‌క్రియ‌లో క్లోత్ ప్యాడ్స్, రుతుస్రావ క‌ప్పులు వాడ‌టం వ‌లన మహిళలకు ఆరోగ్యపరమైన స‌మ‌స్య‌లు రావని, వీటికోసం అనవసరంగా ధనం కూడా వృధా చేసుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదని మంత్రి హ‌రీష్ ‌రావు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − thirteen =