రాష్ట్రంలో ఎరువులు, డీఏపీ కృత్రిమ కొరతపై విచారణకై ప్రధాని మోదీ, కేంద్ర వ్యవసాయమంత్రికి నారా లోకేష్ లేఖ

Nara Lokesh Writes to PM Modi and Union Agriculture Minister for an Inquiry into Shortage of Fertilizers and DAP in AP, Nara Lokesh Writes A Letter To Modi, Nara Lokesh Writes to PM Modi on Fertilizers Shortage, Mango News, Mango News Telugu, Shortage Of Fertilizers and DAP in AP, DAP Fertilizer Shortage In AP, DAP Fertilizers, Nara Lokesh Latest News And Updates, Union Agriculture Minister , PM Narendra Modi

రాష్ట్రంలో ఎరువులు, డీఏపీ కృత్రిమ కొరతపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన లేఖను జత చేస్తూ ట్వీట్ చేశారు. ఈ లేఖలో బ్లాక్ మార్కెటింగ్ ను నివారించి రైతుల్ని ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన డీఏపీ సరఫరా పెంచాలని విజ్ఞప్తి చేశారు. “సహకార సంఘాలకు డీఏపీ సరఫరాలో కోత విధించి, ఆర్బీకేలకు మళ్లించామని చెప్తూ, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. డీఏపీ, ఎరువులకు తీవ్ర కొరత ఏర్పడటంతో ఖరీఫ్ పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం 2.25లక్షల టన్నుల డీఏపీని కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెటింగ్, అసమర్థ విధానాలతో కృత్రిమ కొరత ఏర్పడింది” అని నారా లోకేష్ అన్నారు.

“కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు డీఏపీ ఎరువుల్ని ఆదాయవనరుగా మార్చుకునేందుకు పంపిణీ విధానాన్ని మార్చేశారు. సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయాల్సిన ఎరువుల్ని వైకాపా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు మళ్లించింది. అయితే ఆర్బీకేల్లో డీఏపీ అందుబాటులో ఉండట్లేదు. దీంతో రైతులు బహిరంగ మార్కెట్ లో 50కేజీల డీఏపీ బస్తాను రూ.300 వరకూ అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి డీఏపీ సరఫరా పెంచి కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్ నుండి రైతుల్ని కాపాడాలి” అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + twenty =