ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎస్సీలకు 16 శాతం కాంట్రాక్టు ఏజెన్సీలు రిజర్వ్ : మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao Says 16 Percent Contract Agencies Allocated to SC's in Govt Hospitals, Minister Harish Rao Says 16 Percent Contract Agencies Allocated to SC's in Govt Hospitals In Telangana, Harish Rao Says 16 Percent Contract Agencies Allocated to SC's in Telangana Govt Hospitals, Minister Harish Rao Says 16 Percent Contract Agencies Allocated to SCs, 16 Percent Contract Agencies Allocated to SC's in Govt Hospitals In Telangana, Telangana Govt Hospitals, Minister Harish Rao, Telangana Minister Harish Rao, Telangana Minister, Harish Rao, Harish Rao Minister of Finance of Telangana, Minister of Finance of Telangana, Telangana Finance Minister, Telangana, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16 శాతం కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బందు కేవలం కార్యక్రమం కాదుని, ఇదొక ఉద్యమమని అన్నారు. దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదని, సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో నీటిపారుదల శాఖలో జరిగే టెండర్లలో 21% ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తూ జీవో 59 విడుదల చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్ అండ్ సెక్యూరిటీ, డైట్ ఏజెన్సీల్లో 16% దళితులకు కేటాయిస్తున్నామని చెప్పారు.

“వంద పడకల లోపు హాస్పిటల్ ను ఒక కేటగిరిగా, వంద పడకలకుపైగా ఉన్న హాస్పిటల్ ను మరో కేటగిరి గా విభజించాం. ఏయే ఆస్పత్రులను రిజర్వ్ చేయాలో డ్రా ద్వారా పారదర్శకంగా నిర్ణయించాం. మొత్తం 56 హాస్పిటల్ లను దళితులకు కేటాయించడం జరిగింది. వీటికి త్వరలో టెండర్లు పిలుస్తారు. ఎస్సీ యువత వీటిని అందిపుచ్చుకునేలా టెండర్లు నిబంధనల్లో మార్పులు చేశాం. ఒక్క టెండర్ వచ్చిన పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించాం. ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగు పరచాలని ప్రభుత్వం ఒక్కో బెడ్ కు ఇచ్చే చార్జీలను రూ.5000 నుంచి రూ.7500 కు పెంచడం జరిగింది. ఇందుకోసం ప్రభుత్వం అదనంగా ఏటా రూ.325 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నది. డైట్ ఛార్జీలను సైతం రెట్టింపు చేశాం. మెడికల్ షాపుల్లో కూడా రిజర్వేషన్ ఎలా అమలు చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తుంది” అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − seven =