నాగార్జునసాగర్ ఉపఎన్నిక: నామినేషన్స్ వేసిన 77 మంది అభ్యర్థులు

77 Candidates Filed Nominations for Nagarjunasagar By-election, Candidate for Nagarjuna Sagar By-election, CM KCR, Mango News, Nagarjuna Sagar, Nagarjuna Sagar Assembly By-election, Nagarjuna Sagar By Poll, Nagarjuna Sagar By Poll 2021, Nagarjuna Sagar By Poll News, Nagarjuna Sagar By Poll Updates, Nagarjuna Sagar By-election, Nagarjuna Sagar By-election News, Nagarjuna Sagar By-election Updates, Nagarjunasagar By-election Nominations

నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ మార్చి 30, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికకు మొత్తం 77 మంది అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేసినట్టు చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయెల్ ప్రకటించారు.

మరోవైపు దాఖలైన నామినేషన్ల పరిశీలన ఈ రోజున జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3ను ఆఖరుతేదీగా నిర్ణయించారు. ఇక ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ నిర్వహించి, మే 2 వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు. నామినేషన్ల పక్రియ ముగియడంతో తెలంగాణలో మరోసారి ఉపఎన్నిక సందడి మొదలయింది. ఈ స్థానంలో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

నామినేషన్స్ దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే:

  • టీఆర్ఎస్ – నోముల భగత్ కుమార్
  • కాంగ్రెస్ – జానారెడ్డి
  • బీజేపీ – పానుగోతు రవికుమార్
  • టీడీపీ – అరుణ్ కుమార్ మువ్వా
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + thirteen =