కేంద్రం అకారణంగా నూకల ఎగుమతిపై నిషేధం, వరి ఎగుమతిపై 20 శాతం సుంకం విధించింది – మంత్రి హరీష్ రావు

Minister Harish Rao Slams Central Govt Over Declares 20 Percent Cess on Rice Exports, Minister Harish Rao Slams Central Govt , Harish Rao Slams Central Govt on Rice Exports, Harish Rao Comments on 20 Percent Cess on Rice Exports, Mango News, Mango News Telugu, Rice Export From India , TRS Minister Harish Rao , 20 Percent Cess on Rice Exports, Central Govt Cess on Rice Exports, Central Govt Cess , Minister Harish Rao Latest News And Updates, Harish Rao, TRS PartyMinister Harish Rao Slams Central Govt Over Declares 20 Percent Cess on Rice Exports, Minister Harish Rao Slams Central Govt , Harish Rao Slams Central Govt on Rice Exports, Harish Rao Comments on 20 Percent Cess on Rice Exports, Mango News, Mango News Telugu, Rice Export From India , TRS Minister Harish Rao , 20 Percent Cess on Rice Exports, Central Govt Cess on Rice Exports, Central Govt Cess , Minister Harish Rao Latest News And Updates, Harish Rao, TRS Party

కేంద్రం అకారణంగా నూకల ఎగుమతిపై నిషేధం, వరి ఎగుమతిపై 20 శాతం సుంకం విధిస్తోందని మండిపడ్డారు తెలంగాణ ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. శనివారం ఆయన హైదరాబాద్ పఠాన్‌చెరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. దేశంలో సాధారణంగా ఆహార నిల్వలు తగ్గినప్పుడు మాత్రమే నిషేధం విధిస్తారని, అలాంటిది ఇప్పుడు ఎందుకు నూకల ఎగుమతిపై నిషేధం విధించారని ప్రశ్నించారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలవల్ల వల్ల దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని, దేశ ఆహార భద్రతకు భరోసా లేకుండా చేస్తున్నారని విమర్శించారు.

ప్రధాని మోదీ పాలనలో రైతులకు అన్ని విధాలుగా నష్టం కలుగుతోందని, తెలంగాణలో యాసంగి ధ్యానం కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ కేంద్రం స్పందించలేదని తెలిపారు. అయినా వెనుకడుగు వేయకుండా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణవ్యాప్తంగా కొన్ని లక్షల టన్నుల ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేశామని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు దేశం మొత్తం మన రాష్ట్రం వైపే చూస్తోందని, దేశంలోని సగం రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థాయికి కొత్తగా ఏర్పడిన తెలంగాణ ఎదిగిందని పేర్కొన్నారు. నాడు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసున్నప్పుడు మొత్తం 23 జిల్లాలో కలిపి 72 లక్షల ఎకరాల్లో వరి పందేదని, అదే ఇప్పుడు కేవలం తెలంగాణ వరకే 65 లక్షల ఎకరాల్లో వరి పండుతోందని వెల్లడించారు. ఒకప్పుడు త్రాగునీటికి, సాగునీటికి ఇబ్బంది పడ్డ తెలంగాణలో నేడు ప్రాజెక్టుల నిర్మాణంతో జలసిరి ఉట్టిపడుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ త్వరలోనే సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారని, నూతనంగా నిర్మిస్తోన్న మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారని తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + fourteen =