2000 కిమీ మైలురాయి దాటిన వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం, కొత్తకోట వద్ద పైలాన్ ఆవిష్కరణ

YSRTP Chief YS Sharmila Praja Prasthanam Padayatra Completes 2000 KM Milestone, Praja Prasthanam Padayatra Completes 2000 KM Milestone, YS Sharmila Praja Prasthanam Padayatra Completes 2000 KM Milestone, 2000 KM Milestone, YSRTP Chief YS Sharmila Praja Prasthanam Padayatra, Praja Prasthanam Padayatra, YSRTP Chief YS Sharmila, YS Sharmila, State wide padayatra, Praja Prasthanam Padayatra News, Praja Prasthanam Padayatra Latest News And Updates, Praja Prasthanam Padayatra Live Update, Mango News, Mango News Telugu,

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్ర‌జా ప్ర‌స్థానం’ పేరుతో తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల పాదయాత్ర‌ 148వ రోజుకు (సెప్టెంబర్ 10, శనివారం) చేరుకోగా, 2000 కిలో మీట‌ర్లును మైలురాయిని కూడా ఆమె దిగ్విజ‌యంగా పూర్తి చేసుకున్నారు. వైఎస్ షర్మిల ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలను ముగించుకొని మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్రను చేపడుతున్నారు. పాలమూరు జిల్లాలో కూడా ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర పూర్తి చేశారు.

తన పాదయాత్ర 2000 కిమీ మైలురాయి దాటినందుకు గుర్తుగా కొత్తకోట నేషనల్ హైవే వద్ద విగ్రహాల పరిరక్షణ కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వైఎస్ఆర్ పైలాన్ ను వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. పైలాన్ ఆవిష్కరణ లో ముఖ్య అతిథిగా వైఎస్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. గత ఏడాది అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం ప్రారంభం కాగా, 148 రోజుల్లో వైఎస్ షర్మిల పాదయాత్ర 2000 కిమీ దాటడం, ఆమె ఇచ్చిన హామీలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

2000 కిమీ ప్రజాప్రస్థానం సాగిన విధానం:

  • మొత్తం రోజులు: 148
  • జిల్లాలు: 13
  • నియోజకవర్గాలు: 34
  • మండలాలు: 104
  • మున్సిపాలిటీలు: 31
  • గ్రామాలు: 987
  • బహిరంగ సభలు: 34
  • మాట-ముచ్చట కార్యక్రమాలు: 91
  • నిరుద్యోగ నిరాహార దీక్షలు: 19
  • రైతు గోస ధర్నాలు: 26
  • వడ్ల కొనుగోళ్లపై ధర్నాలు: 7
  • చేనేత ఆత్మీయ సదస్సు: 01
  • పాలమూరు-నీళ్ల పోరు: 01

వైఎస్ షర్మిల హామీలు:

  • వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు అమలు చేస్తాం
  • ఉద్యోగ నోటిఫికేషన్లపైనే తొలి సంతకం. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి.
  • ఇంట్లో ఒక్కరి కంటే ఎక్కువ మంది అర్హులుగా ఉన్న వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మ‌హిళ‌ల‌కు పెన్షన్లు.
  • ఆసుపత్రుల్లో కట్టిన కరోనా బిల్లులు తిరిగి చెల్లింపు. బాధితులకు అండగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.
  • ప్రజలందరికీ ఉచిత విద్య, పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు.
  • అర్హులైన రైతులకు పోడు పట్టాల పంపిణీ చేసి ఆదివాసీ, గిరిజనులకు న్యాయం జరిగేలా తోడ్పాటు.
    ఇల్లు లేని పేదలకు ఇండ్ల నిర్మాణం. ఆ ఇంటి మహిళ పేరు మీదనే రిజిస్ట్రేషన్.
  • ప్రజలకు ఉచిత వైద్యం. ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి, 108, 104 సర్వీసుల పునరుద్ధరణ.
  • పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర. కౌలు రైతులు, రైతు కూలీల సంక్షేమానికి కృషి, రాయితీపై విత్తనాలు, ఎరువులు పంపిణీ.
  • ఇన్ పుట్ సబ్సిడీ, యంత్ర ల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు.
  • నేతన్నలకు ఆరోగ్య బీమాతో జీవిత బీమా స‌దుపాయం.నూలు యంత్రాలకు ఉచిత కరెంట్.
    నూలు యంత్రాల కొనుగోళ్ల‌పై రాయితీ.
  • పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.
  • చేనేత కార్మికులకు వృద్ధ్యాప్య పెన్ష‌న్ తో సంబంధం లేకుండా అదనపు పెన్ష‌న్, చేనేతలకు హ్యాండ్లూమ్ క్ల‌స్ట‌ర్, హ్యాండ్యూమ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు.
  • ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్న పేదల భూములు తిరిగి పేదలకు పంపిణీ.
  • ఎస్టీలకు జ‌నాభా ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాటం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు నిర్ణయాధికారం. స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించేలా చేసి, వారి రక్ష‌ణ‌కు పూర్తి బాధ్య‌త.
  • బీసీ, ఎస్టీ, ఎస్సీలకు కార్పొరేషన్ల ద్వారా లోన్లు.
  • అభయహస్తం డబ్బులు తిరిగి పంపిణీ.
  • మ‌హిళ‌ల‌కు రుణాలు పంపిణీ చేసి, ఆర్థికాభివృద్ధి సాధించేలా తోడ్పాటు.
  • జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు.
  • సాగునీటి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన బాధితుల‌కు ప‌రిహారం పంపిణీ.
  • ఉద్య‌మ‌కారులను స్వ‌రాష్ట్ర యోధులుగా గుర్తించి, వారి సంక్షేమానికి పెద్ద‌పీట.
  • దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన జ‌ల‌య‌జ్ఞం ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం.
  • చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌లకు 50 శాతం ప్రాతినిధ్యానికి పెద్దపీట.
  • ఇంట్లో అర్హులందరికీ రూ.3వేల పెన్షన్.
  • బెల్ట్ షాపులు ఎత్తివేస్తాం.
  • ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలు విడిచిన ప్రతీ ఉద్యమకారుని కుటుంబానికి సొంత ఇల్లు, ఉద్యోగం. ఉద్యమకారులకు స్వతంత్ర యోధులుగా గుర్తింపు, సంక్షేమ నిధులు కేటాయింపు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =