తిరుమ‌ల శ్రీవారిని దర్శించుకున్న హరీష్ రావు.. 50వ జ‌న్మ‌దినం సందర్భంగా మంత్రికి శుభాకాంక్షల వెల్లువ

Minister Harish Rao Visits Tirumala Temple Today on His 50th Birthday, Harish Rao Visits Tirumala Temple Today on His 50th Birthday, Telangana Minister Harish Rao Visits Tirumala Temple Today on His 50th Birthday, Telangana Minister Harish Rao 50th Birthday, Minister Harish Rao 50th Birthday, Harish Rao 50th Birthday, Harish Rao Visits Tirumala Temple, Tirumala Temple, Finance Minister Harish Rao Visits Tirumala Temple, Finance Minister Harish Rao 50th Birthday, Telangana Finance Minister Harish Rao 50th Birthday, Telangana Finance Minister Harish Rao, Finance Minister Harish Rao, Telangana Finance Minister Minister Harish Rao, Harish Rao, 50th Birthday, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తిరుమ‌ల శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు ఆయన జ‌న్మ‌దినం సందర్భంగా నిన్న సాయంత్రం అలిపిరి మెట్లమార్గంలోని మొద‌టి మెట్టు వ‌ద్ద కొబ్బ‌రి కాయ కొట్టి, కాలినడకన తిరుమలకు చేరుకొన్నారు. రాత్రి సమయానికి తిరుమల కొండపైకి చేరుకున్న హరీష్ రావుకు శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈరోజు వేకువఝామున వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం.. రంగనాయకుల మండపంలో మంత్రి హరీష్ రావుకు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్ధ ప్రసాదాలను, పట్టు వస్త్రాలను మంత్రికి అందజేశారు. కాగా నేటితో తను 50వ పడిలో అడుగుపెడుతున్న సందర్భంగా.. స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమ‌ల వచ్చినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.

ఇక మంత్రి హ‌రీష్ రావు జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు పార్టీ నాయకులు, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత ఆయనకు విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు. ఇక త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా. తనపై ఉన్న ప్రేమను ప్రజ‌లకు ఉప‌యో‌గ‌పడే సేవా కార్య‌క్ర‌మాల ద్వారా చాటా‌లని అభి‌మా‌నులు, కార్య‌క‌ర్త‌లకు హ‌రీష్ రావు సూచించిన మీదట ఆయన అభిమానులు తెలంగాణ వ్యాప్తంగా ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అలాగే ముందుగా నిర్ణయించుకున్న కొన్ని వ్యక్తిగత పర్యటనల వలన నియోజకవర్గ ప్రజలకు, అలాగే కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని, దీనికి తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు. అభి‌మా‌నుల ప్రేమాభి‌మా‌నాలను కలకాలం గుండెల్లో పెట్టు‌కుం‌టా‌నని హరీష్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =