భారత్‌లో పాలకులకు ఆర్థిక అభివృద్ధి కన్నా రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి, లేదంటే ఇండియానే నంబర్ వన్ – మంత్రి కేటీఆర్

Minister KTR Attends For The Seminar of 25th National HRD Conference at HICC Hyderabad,Minister KTR Attends Seminar,KTR Attends National HRD Conference,25th National HRD Conference,HICC Hyderabad,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

భారత్‌లో పాలకులకు ఆర్థిక అభివృద్ధి కన్నా రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి ఉంటుందని, లేదంటే ప్రపంచంలో ఇండియానే నంబర్ వన్ గా నిలుస్తుందని పేర్కొన్నారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో 25వ జాతీయ మానవ వనరుల (ఎన్‌హెచ్‌ఆర్‌డీ) సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయారు. దీనిలో భాగంగా ‘డీకోడ్ ది ఫ్యూచర్’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఆయన పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఇక సెమినార్‌లో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పరిశీలిస్తే, దేశాభివృద్ధి కోసం నిధులు కేటాయింపూలు చేసినట్లు కనపడటంలేదని తెలిపారు. అనేక రాష్ట్రాలు తమ అవసరాల మేరకు ప్రతిపాదనలను పంపించాయని, అయినప్పటికీ కేంద్రం పట్టించుకున్న దాఖలా లేదని విమర్శించారు.

చైనా, జపాన్‌ వంటి దేశాలు అభివృద్ధిలో దూసుకెళ్తుంటే, మన దగ్గర మాత్రం కేవలం రాజకీయాలపైనే దృష్టిపెడతారని, అలా కాకుండా ఆర్థిక అభివృద్ధిపై దృష్టిసారిస్తే ప్రపంచంలో నంబర్‌ వన్‌గా ఇండియానే ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మన దేశ జనాభాలో 60 శాతం మంది యువతేనని, అందులో అధికశాతం మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. కానీ వారికి సరైన మార్గ దిర్దేశనం లేక ఉద్యోగాలు కోసమే చూస్తున్నారని, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆలోచన చేయలేకపోతున్నారని అన్నారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని, దేశ జీడీపీలో 5 శాతం వాటా రాష్ట్రానిదేనని తెలిపారు. ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూజిన్‌ గ్రోత్‌కు తెలంగాణ అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వెల్లడించారు. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి ప్రపంచ మేటి సంస్థలు తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయని, టీఎస్‌ఐపాస్‌ ద్వారా కేవలం పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + seven =