కలెక్టర్ల సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్

CM KCR, CM KCR chair meeting with district collectors, CM KCR held Collectors conference, CM KCR Meeting With District Collectors To Take Key Decisions On State, CM KCR Meeting With District Collectors To Take Key Decisions On State Issues, CM KCR resume district tours from Dec 19, District Collectors, KCR Meeting With District Collectors, KCR Meeting With District Collectors To Take Key Decisions, Mango News, Mango News Telugu, Paddy Procurement, Paddy Procurement Centers, paddy procurement centers in Rabi, Paddy procurement issue

ప్రగతి భవన్‌లో ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్, కలెక్టర్లతో సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల విభజన, దళితబంధు, ధాన్యం సేకరణ, యాసంగి పంటల మార్పిడిపై కలెక్టర్లకు పలు సూచనలు చేశారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏర్పాటైన నూతన జోనల్ వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని కలెక్టర్లకు స్పష్టం చేసారు సీఎం కేసిఆర్. స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పాలన ఉండాలన్నారు. అప్పుడే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని పేర్కొన్నారు.

స్థానికంగా ఉండే యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పోస్ కేస్ వంటి అంశాలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు అయిన పక్షంలో.. ఒకే చోట పనిచేస్తెనే వారు ప్రశాంతంగా పనిచేయగలుగుతారని చెప్పారు. తద్వారా, ఉత్పాదకత కూడా పెరుగుతుందని సీఎం తెలిపారు. కాగా, నూతన జోనల్ వ్యవస్థతో ఇది అమలులోకి వస్తుందని కెసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేసినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం కెసీఆర్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =