దళితుల ఆర్ధిక అభివృద్దే లక్ష్యం, దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేసిన మంత్రి తలసాని

Minister Talasani Srinivas Distributed Vehicles to Dalita Bandu Scheme Benefiters at Hyderabad, Telangana Minister Talasani Srinivas Distributed Vehicles to Dalita Bandu Scheme Benefiters at Hyderabad, Talasani Srinivas Distributed Vehicles to Dalita Bandu Scheme Benefiters at Hyderabad, Vehicles to Dalita Bandu Scheme Benefiters at Hyderabad, Dalita Bandu Scheme Benefiters at Hyderabad, Dalita Bandu Scheme Benefiters, Dalita Bandu Scheme, 28 Dalita Bandu Scheme beneficiaries, Dalita Bandu Scheme beneficiaries, Telangana Minister Talasani Srinivas, Minister Talasani Srinivas, Talasani Srinivas, Talasani Srinivas Yadav, Dalita Bandu Scheme News, Dalita Bandu Scheme Latest News, Dalita Bandu Scheme Latest Updates, Dalita Bandu Scheme Live Updates, Mango News, Mango News Telugu,

దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ లో 28 మంది దళితబంధు లబ్ధిదారులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ జిల్లా కలెక్టర్ శర్మన్ తో కలిసి వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభ్యున్నతికోసం ప్రభుత్వం కృషిచేస్తుందని చెప్పారు. అభివృద్దిలో ఎంతో వెనుకబడిన దళితులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆలోచన అన్నారు. అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబందు పథకాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ పథకంలో ఒకొక్క లబ్ధిదారుడికి 10 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో మీకు అనుభవం ఉన్న రంగంలో పెట్టుబడులు పెట్టి లబ్దిపొందాలని సూచించారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ పథకం క్రింద పొందిన వాహనాలను అమ్మాలని ప్రయత్నిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రాష్ట్రంలో ఉన్న దళితులు అందరికి దశలవారిగా దళితబందు పథకం క్రింద ఆర్ధిక సహాయం అందిస్తామని తెలిపారు. గతంలో ఎవరైనా దళితుల అభివృద్ధి గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. పేదింటి ఆడపడుచు పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ క్రింద లక్ష 116 రూపాయల ఆర్ధిక సహయం అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో 500 రూపాయలు ఉన్న వృద్దులు, వితంతువుల పెన్షన్ ను 2 వేల రూపాయలకు పెంచి ఇస్తున్నట్లు తెలిపారు. శుభకార్యాల నిర్వహణ కోసం పేదలు ఫంక్షన్ హాల్స్ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని, వారిపై ఆ భారం పడకుండా ఉండేందుకు మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లను నిర్మించి అతితక్కువ అద్దెకు ఇస్తున్న విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ గుర్తుచేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =