ఉదయ్‌పూర్​ ఘటన భ‌యాందోళ‌న‌కు గురిచేసింది, ఆ నేరస్థులను అత్యంత క‌ఠినంగా శిక్షించాలి – మంత్రి కేటీఆర్

Minister KTR Condemns The Udaipur Shocking Incident and Demands For Punishment of Accused Persons, Telangana Minister KTR Condemns The Udaipur Shocking Incident and Demands For Punishment of Accused Persons, KTR Condemns The Udaipur Shocking Incident and Demands For Punishment of Accused Persons, Minister KTR Demands For Punishment of Accused Persons, Telangana Minister KTR Condemns The Udaipur Shocking Incident, KTR Condemns The Udaipur Shocking Incident, Udaipur Shocking Incident, Punishment of Accused Persons, barbaric broad daylight murder of a tailor in Rajasthan's Udaipur, Udaipur Shocking Incident News, Udaipur Shocking Incident Latest News, Udaipur Shocking Incident Latest Updates, Udaipur Shocking Incident Live Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో చోటు చేసుకున్న ఘటన తనను భ‌యాందోళ‌న‌కు గురిచేసిందని తెలిపారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు. దీనిపై ఆయన ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఉదయ్‌పూర్‌ హ‌త్య ఘటన చాలా బాధాకరమని, ఆ క్రూర‌మైన హ‌త్య వెనుక ఉన్న కార‌ణం త‌న‌ను షాక్‌కు గురి చేసింద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి అనాగ‌రిక హింస‌కు స‌మాజంలో చోటు లేద‌ని అభిప్రాయపడ్డారు. ఇలాంటి క్రూర‌మైన హ‌త్య‌ల‌కు పాల్ప‌డే నేర‌స్తుల‌కు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అత్యంత క‌ఠిన‌మైన శిక్ష విధించాల‌ని మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో కోరారు.

అసలు ఉద‌య్‌పూర్‌లో ఏం జ‌రిగిందంటే.. మంగళవారం ఉద‌య్‌పూర్‌లోని ధన్‌మండీ ఏరియాలోని ఒక దుకాణంలోకి ఇద్దరు వ్యక్తులు చొరబడి ఓ టైలర్‌ను దారుణంగా హత్య చేశారు. దారుణంగా కత్తితో తల నరికి మొండెం నుంచి వేరు చేశారు. అంతేకాకుండా ఆ హత్య వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త నగరమంతా దావాలనంలా వ్యాపించింది. ఐయే ఈ ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు వెంటనే నిందితులను అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నగరంలో భారీగాబలగాలు మోహరించి కర్ఫ్యూ విధించారు. 24 గంటల పాటు అక్కడ ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. ప్రజలు సంయమనం వహించాలని, ఈ హత్యకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేయొద్దని రాజ‌స్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే విషయం తీవ్రతను అర్ధం చేసుకున్న కేంద్ర హోంశాఖ ఎన్‌ఐఏ బృందాన్ని ఉదయ్‌పూర్‌కు పంపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here