లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు

Hyderabad Metro, Hyderabad Metro Rail, Hyderabad Metro Rail Services Rescheduled, Hyderabad Metro Rail Timing Changes During Lockdown, Hyderabad Metro Revises, Hyderabad Metro Services, Hyderabad Metro Services From Today, Hyderabad Metro Timings Changed, Hyderabad Metro timings changed in wake of lockdown, Lockdown Extended in Telangana, Mango News, Metro timings revised, Telangana Lockdown, Timings of Hyderabad Metro Rail Services, Timings of Hyderabad Metro Rail Services Rescheduled

తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ ను మరో పది రోజుల పాటుగా కొనసాగించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ లాక్‌డౌన్‌ సమయంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంట వరకు సడలింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లిన ప్రజలు ఇంటికి చేరడానికి మరో గంట పాటు, అనగా సాయంత్రం 6 గంటల వరకు సమయం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో హైద‌రాబాద్ మెట్రో రైలు స‌మ‌యాల్లో మార్పులు చేయబడ్డాయి. ప్రయాణ సమయాలను రీషెడ్యూల్ చేస్తూ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ఒక ప్రకటన విడుదల చేశారు.

జూన్ 10, గురువారం నుంచి నగరంలోని టెర్మినల్ మెట్రో స్టేషన్స్ లో మొదటి రైలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే టెర్మినల్ మెట్రో స్టేషన్స్ లో చివ‌రి మెట్రో రైలు సాయంత్రం 5:00 గంటకు ప్రారంభమవుతుందని, ఆ మెట్రో రైళ్లు సాయంత్రం 6:00 గంట‌లకు డెస్టినేషన్ కు చేరుకుంటాయని తెలిపారు. ఈ సమయ మార్పులు జూన్ 19 వరకు అమల్లో ఉండనున్నాయి. ప్రతి ఒక్కరి భద్రతా దృష్ట్యా ప్రయాణికులంతా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం, థర్మల్ స్క్రీనింగ్ మరియు ఇతర అన్ని కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. అలాగే ప్రయాణికులంతా సెక్యూరిటీ అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here