ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసింగ్, ముంబయిలో కర్టెన్ రైజర్ ఈవెంట్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్

Minister KTR Participated in Curtain-raiser Event of Formula E World Championship in Mumbai, Curtain-raiser Event of Formula E World Championship in Mumbai, Minister KTR Participated in Curtain-raiser Event of Formula E World Championship, Curtain-raiser Event of Formula E World Championship, Formula E World Championship, Curtain-raiser Event, Telangana Minister KTR, Curtain-raiser Event in Mumbai, Mango News, Mango News Telugu

హైదరాబాద్‌ నగరంలో ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా-ఈ రేస్‌ ఛాంపియన్‌షిప్‌ 30 రోజుల కౌంట్‌డౌన్‌ కార్యక్రమం గురువారం ముంబయిలో గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద ఘనంగా జరిగింది. ముంబయి లో జరిగిన ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కర్టెన్ రైజర్ ఈవెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అలాగే కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, గ్రీన్‌కో వ్యవస్థాపకుడు అనిల్‌కుమార్‌ చలమలశెట్టి, తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్, పరిశ్రమలు అండ్ వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశం యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ మోటార్‌స్పోర్ట్ రేస్‌ను 2023, ఫిబ్రవరి 11న నిర్వహించేందుకు హైదరాబాద్ లో అన్ని ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, భారతీయ నగరంలో ఫార్ములా-ఈ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించాలనే కల త్వరలో సాకారం కానుంది. ఈ ఈవెంట్ కోసం ప్రపంచంలోని అనేక ప్రముఖ నగరాలు పోటీపడగా, అన్నింటినీ ఓడించి హైదరాబాద్‌ ఈ అవకాశాన్ని దక్కించుకుంది. తెలంగాణలోని హైదరాబాద్ కు ఈ అవకాశం రావడం గర్వంగా ఉంది. ఇది దేశానికి ఘనత. వచ్చే 4 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కాగా ఫార్ములా-ఈ రేసింగ్ లో 9 దేశాల నుంచి ఏస్‌ గ్రాండ్‌స్టాండ్‌లు, ప్రీమియం గ్రాండ్‌స్టాండ్‌లు, చార్డ్‌డ్‌ గ్రాండ్‌స్టాండ్‌లు, మెక్‌లారెన్‌, మసెరటి, పోర్షే, జాగ్వార్‌, నిస్సాన్‌ మహీంద్రా రేసింగ్‌ వంటి 11 జట్లు 22 కార్లతో పాల్గొననున్నాయి. ఇక మొబిలిటీ రంగంలో స్టార్టప్‌లు మొబిలిటీ ఐడియాల ఛాలెంజ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించబడే ఈవీ సమ్మిట్‌ను కూడా ఫిబ్రవరిలో హైదరాబాద్ లో నిర్వహించబడుతుందన్నారు. తెలంగాణ దేశంలో తొలిసారిగా విద్యుత్తు వాహనాల విధానం తెచ్చిందని తెలిపారు. అలాగే సాధారణ ప్రజల కోసం హైదరాబాద్ ఈ-మోటార్ షో కూడా నిర్వహించబడుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + one =