సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త చలాన్ల రేట్లు

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, New traffic challans, New traffic challans coming into effect, New traffic challans coming into effect from 1st, New traffic challans coming into effect from 1st September, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019 Attachments 1 File download (4).jpeg ATTACH FILES Comments Please enter comments here...

పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం మోటార్ వాహన నిబంధన చట్టం ఆమోదించుకున్న తరువాత, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడ ఆమోద ముద్ర వేశారు. కొత్త చట్టం ప్రకారం రవాణా నిబంధనలు అన్ని కఠినముగా మారాయి. మారిన నిబంధనలను దశలవారీగా అమలు చేయాలనీ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ట్రాఫిక్ అతిక్రమణలకు వసూలు చేస్తున్న రుసుములను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరకు రవాణాలో కూడ అధిక బరువుతో వాహనాలు పట్టుబడితే ప్రస్తుతమున్న రెండు వేల రుసుమును, ఒకేసారి రూ.20 వేలకు పెంచారు. అదనపు టన్ను బరువుకు రెండు వేల రుసుముగా నిర్ణయించారు. అధిక సంఖ్యలో ప్రయాణికులకు ఎక్కించుకున్న, ద్విచక్ర వాహనం పై అధిక బరువు తీసుకెళ్లినా భారీ స్థాయిలో పెంచిన కొత్త చలాన్ల రేట్లు కట్టాల్సిఉంటుంది. కొత్తగా వచ్చిన ట్రాఫిక్ నిబంధనలపై ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఉల్లంఘన                           జరిమానా
హెల్మెట్ వాడకపోతే                రూ.1000
సీటుబెల్ట్ పెట్టుకోకపోతే           రూ.1000
సెల్ ఫోన్ డ్రైవింగ్                  రూ.5000
రాంగ్ సైడ్ డ్రైవింగ్                 రూ.5000
డ్రంకెన్ డ్రైవింగ్                     రూ.10000
డేంజర్ డ్రైవింగ్                     రూ.5000
సిగ్నల్ జంప్                        రూ.5000
ట్రిపుల్ రైడింగ్                      రూ.5000
వాహనానికి భీమా లేకుంటే       రూ.2000
వాహనానికి పర్మిట్ లేకుంటే       రూ.10000
డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే            రూ.5000

 

[subscribe]
[youtube_video videoid=D8HNybIjVE8]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 1 =