హైదరాబాద్‌లో ఫారెస్ట్ నేషనల్ వర్క్ షాప్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Hyderabad, KTR News, KTR Participates in National Forest Workshop, KTR speaking at National Workshop, KTR Speech, Mango News, Minister KTR, Minister KTR Participates in National Forest Workshop Today, Minister KTR Participates in National Forest Workshop Today At Hyderabad, National Forest Workshop, National Forest Workshop Today At Hyderabad, National Workshop organised by Telangana State Forest, Telangana Forest Department, telangana forest department officers, telangana forest minister

ఈరోజు (శుక్రవారం) హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయలో అటవీశాఖ నేషనల్ వర్క్ షాప్‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సహచర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి హాజరైన ఆయన ఈ కార్యక్రమంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సూచనలతో తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ క్రమంలో సీడ్ బాల్స్ వేసేందుకు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నాం అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన తెలంగాణలో పచ్చదనం శాతం 24 నుంచి 31 శాతానికి పెరిగినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. నగరాలలో పరిశ్రమలతో పాటు పచ్చదనంపై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. పట్టణాలలో వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతుల విషయంలో అటవీశాఖ కూడా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సానుకూల నిర్ణయాలను తీసుకోవాలన్నారు. దేశంలో కృషి విజ్ఞాన కేంద్రాల తరహాలోనే అటవీ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ సూచించారు. అలాగే, పచ్చదనాన్ని పెంచటానికి కృషి చేస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా ‘కాంపా’ నిధులను అదనంగా అందివ్వాలని కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =