విద్యుత్ చార్జీల పెంపుపై ఈఆర్సీ బహిరంగ విచారణ.. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Electricity Bills Hike, Electricity Bills Hike News, ERC Public Hearing, ERC Public Hearing on Electricity Charges, ERC Public Hearing on Electricity Charges At Hyderabad, Hyderabad, Public Meeting on Electricity Bills Hike, Revanth Reddy, Revanth Reddy Attends To ERC Public Hearing, Revanth Reddy Attends To ERC Public Hearing on Electricity Charges, Revanth Reddy Attends To ERC Public Hearing on Electricity Charges At Hyderabad, Revanth Reddy Public Meeting, Revanth Reddy Public Meeting on Electricity Bills Hike, TPCC Chief Revanth Reddy, TPCC Chief Revanth Reddy Attends To ERC Public Hearing on Electricity Charges, TPCC Chief Revanth Reddy Attends To ERC Public Hearing on Electricity Charges At Hyderabad

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై రెడ్ హిల్స్‌లోని ఫ్యాప్సీ బిల్డింగ్‌లో నేడు ఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హియరింగ్‌కు హాజరై తన వాదనలు వినిపించారు. కాగా, ఈ బహిరంగ విచారణ సందర్భంగా వచ్చే సూచనలు, అభ్యంతరాలను ఈఆర్సీ పరిశీలించి చార్జీల పంపుపై తుది నిర్ణయం తీసుకుంటుంది. 2022-23 సంవత్సరానికిగాను రూ.6831 కోట్ల చార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదనలు చేశాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి తన అభ్యంతరాలను, సలహాలను తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర డిస్కంల అప్పులు రూ.60 వేల కోట్లకు చేరాయని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్‌ సంస్థ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కారణమని రేవంత్‌ రెడ్డి అన్నారు. డిస్కంలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని.. చార్జీలు పెంచేటప్పుడు సామాన్యుడిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. పేద ప్రజలు, మధ్యతరగతి వర్గాలు చార్జీల పెంపును హర్షించవని అన్నారు. వేతన జీవులకు ఇది మోపలేని భారం అవుతుందని చెప్పారు. డిస్కంలు ఈ విషయంలో ఆలోచన చేయాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =