రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: వరుస బాంబుదాడులతో ఒణుకుతున్న ఉక్రెయిన్

Russia-Ukraine War Updates Putin's Military Crosses Border Tanks Roll Into Kyiv Over Belarus Border, Russia-Ukraine War Updates Putin's Military Crosses Border, Tanks Roll Into Kyiv Over Belarus Border, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Russia-Ukraine War Live Updates, Russia Ukraine War, Ukraine conflict, Conflict in Ukraine, Russia Ukraine conflict LIVE updates, Russia Ukraine conflict News, Russia Ukraine conflicts, Russo Ukrainian War, Ukraine Russia Conflict, Ukraine Russia War, Ukraine, Russia, Ukraine News, Ukraine Updates, Ukraine Latest News, Ukraine Live Updates, russia ukraine war news, russia ukraine war status, Russia Ukraine News Live Updates, Ukraine News Updates, War in Ukraine Updates, Russia war Ukraine, ukraine news today, ukraine russia news telugu, Mango News, Mango News Telugu,

వరుస బాంబుదాడులతో ఉక్రెయిన్ వణికిపోతోంది. లక్షల సంఖ్యలో రష్యా దళాలు దేశంలోకి ప్రవేశించాయి. వందలాది యుద్ధ ట్యాంకులతో ఉక్రెయిన్ బోర్డర్ ను చుట్టుముట్టాయి. దేశ ప్రజలందరూ ఇళ్లను వదిలి బంకర్ల లోకి వెళ్లి తల దాచుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సూచించారు. రష్యాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు చేస్తున్న సంకీర్ణ ప్రయత్నాలపై అధ్యక్షుడు జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రష్యాతో పోరాటంలో తమ దేశం “ఒంటరిదై పోయింది” అని తమ నిస్సహాయతను తెలియజేశారు.

కాగా, శుక్రవారం తెల్లవారుజామున రాజధాని కైవ్‌ను కుదిపేసిన భయంకరమైన రాకెట్ దాడులపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా స్పందించారు. మా రాజధాని చివరిసారిగా 1941లో నాజీ జర్మనీచే దాడి చేయబడినప్పుడు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంది. మళ్ళీ ఇప్పుడు ఆ అనుభవాన్ని మా ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు అని వాపోయారు. నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రకటింటించిన నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. ప్రముఖ పట్టణాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే, పుతిన్.. ఇది కేవలం అక్కడి పౌరులను రక్షించడానికి ఉద్దేశించబడింది మాత్రమే.. ఉక్రెయిన్‌ను ఆక్రమించాలనే లక్ష్యం రష్యాకు లేదని పేర్కొన్నారు.

అగ్రరాజ్యం అమెరికా దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా దూకుడుని నియంత్రించటానికి అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. తూర్పు యూరప్‌లో రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ భూభాగాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ తన NATO మిత్రదేశాలను రక్షించడానికి అదనపు దళాలను మోహరించింది. కాగా, గత ఏడాది ఉక్రెయిన్‌కు అమెరికా 650 మిలియన్ డాలర్లకు పైగా రక్షణ సహాయం అందించింది. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో.. ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా భారతదేశం సంబంధిత అన్ని పక్షాలతో సంప్రదింపులు జరుపుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =