హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులపై మంత్రి కేటిఆర్ ట్వీట్

Chances To Introduce Double Decker Buses Again, Double Decker Buses, Double Decker Buses in Hyderabad, KTR Responds over Double Decker Buses in Hyderabad, Minister KTR, Minister KTR Responds over Double Decker Buses, Telangana Double Decker Buses, Telangana News, Telangana Political News

గతంలో హైదరాబాద్ నగరంలో డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులతో ప్రయాణికులకు సేవలందించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత కాలక్రమేణా ఆ బస్సులు కనుమరుగయ్యాయి. తాజాగా డబుల్ డెక్కర్ బస్సులను మళ్ళీ గుర్తు చేస్తూ షాకీర్‌ హుస్సేన్‌ అనే యువకుడు మంత్రి కేటిఆర్ ను ట్విట్టర్లో ట్యాగ్ చేశారు. ఒకప్పుడు జూపార్క్ నుంచి 7z నంబర్ తో అఫ్జ‌ల్‌గంజ్‌, హైకోర్టు మీదుగా సికింద్రాబాద్‌ వరకు తిరిగే డబుల్ డెక్కర్ బస్సులు ఎవరికైనా గుర్తున్నాయా? అని అడుగుతూ, మళ్లీ ఆ ‌ బస్సులను టూరిస్టులు/ప్రయాణికుల కోసం తీసుకురావాల‌ని మంత్రి కేటిఆర్‌ను కోరుతూ ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్ పై మంత్రి కేటిఆర్ స్పందిస్తూ, అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌కు వెళ్లేటప్పుడు డబుల్ డెక్కర్ బ‌స్సులు క‌నిపించేవని, ఆ బస్సులపై తనకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఆ బస్సులు రోడ్లపైకి రాకుండా ఎందుకు పూర్తిగా ఆపేశారో తనకు తెలియదని అన్నారు. డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ హైదారాబాద్‌ రోడ్లపైకి తీసుకొచ్చే అవకాశం​ ఏమైనా ఉందా అంటూ రాష్ట్ర రవాణా ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌ కుమార్ ను మంత్రి కేటిఆర్ అడిగారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + seven =