ఈడీ ముందు హాజరయిన సోనియా గాంధీ.. దేశవ్యాప్త నిరసనలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ

National Herald Case Congress Party Calls For The Country Wide Protests Against ED Enquiry on Sonia Gandhi Today, Congress Party Calls For The Country Wide Protests Against ED Enquiry on Sonia Gandhi Today, ED Enquiry on Sonia Gandhi Today, Congress Party Calls For The Country Wide Protest, Country Wide Protest, Congress Party Country Wide Protest, Sonia Gandhi ED Enquiry, National Herald Case, ED Enquiry, Congress Party Protest, Sonia Gandhi, INC Leader Sonia Gandhi, ED Enquiry On National Herald Case, National Herald Case News, National Herald Case Latest News, National Herald Case Latest Updates, National Herald Case Live Updates, Mango News, Mango News Telugu,

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రాతో క‌లిసి సోనియా ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ ఎంపీలు, నేతలు గురువారం కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసు దాకా పాదయాత్ర చేపట్టారు. సోనియా గాంధీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందంటూ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల ఆదేశాలనే ఈడీ సంస్థ పాటిస్తోందని, అందుకే ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనిగా పెట్టుకుందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలో ఏఐసీసీ కార్యాలయం ఉన్న అక్బర్‌ రోడ్డును పోలీసులు బ్లాక్ చేశారు. బారికేడ్లు ఏర్పాటుచేసి అటువైపు ఎవరిని అనుమతించడంలేదు. అయితే సోనియాను విచారించడానికి ఈడీ ప్రత్యేకంగా ఒక బృందాన్ని సిద్ధం చేసింది. అయిదుగురు ఆఫీస‌ర్ల ఈ ద‌ర్యాప్తు బృందానికి ఒక మ‌హిళా అధికారి నేతృత్వం వ‌హించ‌నున్నారు. కాగా నేషనల్‌ హెరాల్డ్‌-ఏజేఎల్‌ వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్‌ జరిగినట్లుగా ఈడీ భావిస్తున్న నేపథ్యంలో.. దీనిలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి సంబంధం ఉందంటూ సోనియా గాంధీతో పాటు కుమారుడు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేయడం తెలిసిన విషయమే. కాగా ఇప్పటికే రాహుల్ గాంధీ 5 రోజుల పాటు ఈడీ ఎదుట హాజరవగా అధికారులు సుమారు 50 గంటలపాటు ఆయనను విచారించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 15 =