భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు పట్టణాల్లోని పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సమీక్ష

Minister KTR Reviewed Excess Rainfall Situation within GHMC and All Other Towns in the State, Telangana Minister KTR Reviewed Excess Rainfall Situation within GHMC and All Other Towns in the State, KTR Reviewed Excess Rainfall Situation within GHMC and All Other Towns in the State, Excess Rainfall Situation within GHMC and All Other Towns in the State, Telangana Excess Rainfall Situation, Excess Rainfall Situation, Greater Hyderabad Municipal Corporation, Heavy Rains In Telangana, Telangana Heavy Rains, Telangana Heavy Rains News, Telangana Heavy Rains Latest News, Telangana Heavy Rains Latest Updates, Telangana Heavy Rains Live Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల్లో నెలకున్న తాజా పరిస్థితులపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌ కాలికి గాయమవడంతో మూడు వారాల విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బృందంతో జీహెఛ్ఎంసీ మరియు రాష్ట్రంలోని అన్ని ఇతర పట్టణాల్లో అధిక వర్షపాతం ఫలితంగా ఏర్పడ్డ పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా జీహెఛ్ఎంసీ, జలమండలి మరియు పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకుని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల వలన ప్రభావితమైన ప్రాంతాలపైన ప్రధానంగా దృష్టి సారించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని చెప్పారు. వర్షాలు ఇలాగే కొనసాగితే చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యల పైన కూడా ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

మరోవైపు వరుసగా కురుస్తున్న వర్షాల వలన పురాతన భవనాలు కూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించే చర్యలు కొనసాగించాలని మంత్రి సూచించారు. అదేవిధంగా పట్టణాల్లో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలకు సంబంధించిన ప్రాంతాల పైన ప్రధాన దృష్టి సారించి హెచ్చరిక సూచీలను ఏర్పాటు చేయాలన్నారు. స్థానికంగా ఉన్న పోలీస్, సాగునీటి, విద్యుత్ మరియు రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరం మరియు పరిసర పురపాలికల్లోని యంత్రాంగం, స్థానిక జలమండలి కలిసి వరద నివారణ/తగ్గింపు చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఉన్న జీహెఛ్ఎంసీ, జలమండలి కమాండ్ కంట్రోల్ సెంటర్లను విస్తృతంగా ఉపయోగించుకోవాలని, రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీడీఎంఏ కు ఆదేశించారు. అలాగే వర్షాలు తగ్గుముఖం పట్టగానే అత్యవసరమైన రోడ్ల మరమ్మతులను వెంటనే ప్రారంభించాలన్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ, సీడీఎంఏతో కలిసి పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక సీఎస్‌ అరవింద్‌ కుమార్‌ ను మంత్రి కేటీఆర్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =