హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ మైనర్ బాలిక కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరు, జువైనల్‌ హోం నుంచి విడుదల

Jubilee Hills Minor Girl Molestation Case All Accused Gets Bail Including MLA Son, Minor Girl Molestation Case All Accused Gets Bail Including MLA Son, Jubilee Hills Minor Girl Molestation Case, Jubilee Hills gang-rape case, MLA's son released on bail, Forensic report nails 4 accused in Jubilee Hills Minor Girl Molestation Case, Hyderabad Gang Rape Case, 4 minor accused released on bail, jubilee hills Minor Girl case, MLA Son, Jubilee Hills Gang Rape Case News, Jubilee Hills Gang Rape Case Latest News, Jubilee Hills Gang Rape Case Latest Updates, Jubilee Hills Gang Rape Case Live Updates, Mango News, Mango News Telugu,

జూబ్లీహిల్స్​ మైనర్​ బాలిక ఘటన కేసులో నిందితులకు బెయిల్ లభించింది. వీరిలో నలుగురికి మంగళవారం జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేయగా మరో నిందితుడు, ఎమ్మెల్యే కుమారుడికి హైకోర్టు ఈరోజు బెయిల్ ఇచ్చింది. అయితే నిందితులకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చేందుకు జువైనల్ కోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో నిందితులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను రెండుసార్లు కోర్టు తిరస్కరించగా, తాజాగా మరోసారి పిటిషన్‌ వేయడంతో కొన్ని షరతులు విధిస్తూ జువైనల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ, ఇదే కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కుమారుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ లభించింది.

కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ 28న ఓ పార్టీలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్‌ అమ్నేషియా పబ్‌కు వచ్చిన ఒక మైనర్‌ బాలికపై సాదుద్దీన్‌ అనే యువకుడితో పాటు మరో నలుగురు మైనర్లు సామూహిక అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. అయితే నిందితుల్లో చాలా మందికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది. నలుగురు మైనర్లు కావడంతో.. పోలీసులు సాదుద్దీన్‌ను ప్రధాన నిందితుడిగా కేసులో పేర్కొన్నారు. మిగతా వారిలో ఓ ప్రభుత్వ శాఖలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి కుమారుడు, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడితో పాటు మరో ఇద్దరు వ్యాపారవేత్తల కుమారులున్నారు. ఇక ఈ కేసులో వీరి పాత్ర ఉన్నట్లు కోర్టులో రుజువైతే, నిందితులకు 20 ఏళ్లదాకా జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here