కేంద్రం ప్రకటించిన ఎస్‌ఎస్‌జీలో దేశంలోనే తెలంగాణ టాప్‌ర్యాంక్‌లో నిలవడం గర్వకారణం – మంత్రి కేటీఆర్

Minister KTR Says Proud That Telangana Topped The Country in Swachh Sarvekshan Grameen Rankings Issues by Centre, Telangana 1st Rank In Swachh Survekshan Grameen, Swachh Bharat Mission, Telangana Secures 12 Awards In Sanitation, Waste Management, Telangana Bags 12 Swachh Survekshan Awards, Mango News, Mango News Telugu, Swachh Survekshan, Swachh Survekshan 2022, Telangana Swachh Survekshan, Swachh Survekshan Latest News And Updates, Telangana News And Live Updates

స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బిఎం-జి) కింద పెద్ద రాష్ట్రాల విభాగంలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ (ఎస్‌ఎస్‌జీ) ర్యాంకింగ్స్‌లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి వల్లే ఇది సాధ్యమయిందని, అందుకే ఆయనకు ధన్యవాదాలని అన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, అధికారులు సహా 12,769 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులను అభినందిస్తున్నానని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

కాగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద జల్ శక్తి మంత్రిత్వ శాఖ జాతీయ జల్ జీవన్ మిషన్ ఈ ర్యాంకులను ప్రకటించింది. సౌత్ జోన్‌లోని ఓవరాల్ టాప్ జిల్లాల విభాగంలో నిజామాబాద్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు వరుసగా మొదటి మరియు ద్వితీయ స్థానాల్లో ఉండటంతో రాష్ట్రం మొత్తం 12 అవార్డులను గెలుచుకుంది. అక్టోబర్ 2న న్యూఢిల్లీలో జరిగే స్వచ్ఛ భారత్ దివస్ వేడుకల సందర్భంగా అవార్డులను అందజేస్తామని ఎస్‌బిఎం-జి మిషన్ డైరెక్టర్ వికాస్ షీల్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌కు రాసిన లేఖలో తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here