జర్నలిస్టుల కోసం కడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

Drink Bhagiratha water for better health, KTR Started Mission Bhagiratha Water Tank in Warangal, Mango News, Minister KTR, Minister KTR Started Mission Bhagiratha Water Tank in Warangal, Mission Bhagiratha, mission bhagiratha in telangana, Mission Bhagiratha in Warangal, Mission Bhagiratha tank, mission bhagiratha telangana, Mission Bhagiratha Water, Mission Bhagiratha Water Tank, Mission Bhagiratha Water Tank in Warangal, Warangal

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ‌సోమవారం నాడు వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాంపూర్ గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన మిష‌న్ భ‌గీర‌థ వాట‌ర్ ట్యాంక్‌ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 8 ల‌క్ష‌ల లీట‌ర్ల సామ‌ర్థ్యంతో నిర్మించిన ఈ వాట‌ర్ ట్యాంకు ద్వారా వరంగల్ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించనున్నారు. వాటర్ ట్యాంక్ అందుబాటులోకి రావ‌డంతో స్థానిక ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వాట‌ర్ ట్యాంకు ప్రారంభానికి ముందు అక్క‌డ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిష‌న్‌ను మంత్రి కేటీఆర్ వీక్షించారు.

జర్నలిస్టుల కోసం కడుతున్న 200 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన:

మరోవైపు వరంగల్ నగరంలోని దూపకుంటలో రూ.31.80 కోట్లతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మరియు దేశాయిపేటలో రూ.10.60 కోట్లతో జర్నలిస్టుల కోసం కడుతున్న 200 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ వరంగల్‌ పర్యటనలో మొత్తం రూ.1,700 కోట్లతో చేపట్టిన పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మంత్రి కేటీఆర్ వెంట రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ.వినోద్‌కుమార్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, నన్నపునేని నరేందర్‌, చల్లా ధర్మారెడ్డి, టీ.రాజయ్య ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + ten =