కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సుశీల్‌చంద్ర నియామకం

Election Commissioner of India, India, Mango News, New Chief Election Commissioner, New Chief Election Commissioner of India, Sushil Chandra, Sushil Chandra Appointed as New Chief Election Commissioner, Sushil Chandra Appointed as New Chief Election Commissioner of India, Sushil Chandra appointed Chief Election Commissioner, Sushil Chandra appointed new Chief Election, Sushil Chandra appointed new Chief Election Commissioner

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ గా(సీఈసీ) సుశీల్‌చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సునీల్‌ ఆరోరా పదవీకాలం నేటితో(ఏప్రిల్ 12, సోమవారం) ముగిసింది. ఈ నేపథ్యంలో నూతన సీఈసీగా సుశీల్‌చంద్రను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నియమించారు. 24వ సీఈసీగా సుశీల్‌చంద్ర మంగళవారం నాడు బాధ్యతలు స్వీకరించనున్నారు. మే 14, 2022 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ మరియు మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు సుశీల్‌చంద్ర నేతృత్వంలో జరగనున్నాయి. ముందుగా గత లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 14, 2019 న ఎన్నికల కమిషనర్‌ గా సుశీల్‌చంద్ర నియమించబడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ఉన్న కమిషనర్లలో సీనియర్‌ అయిన సుశీల్‌చంద్ర తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘంలోకి రాకముందు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ఛైర్మన్‌ గా సుశీల్‌చంద్ర బాధ్యతలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 8 =