టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు

TSPSC Question Paper Leakage Case SIT Issues Notices To TPCC Chief Revanth Reddy,TSPSC Question Paper Leakage,TSPSC Question Paper Leakage Case,TSPSC Question Paper Leaked,Mango News,Mango News Telugu,SIT Issues Notices,SIT Notices,SIT Latest News and Updates,TPCC Chief Revanth Reddy,TPCC Chief Revanth Reddy News and Updates,TSPSC Question Paper

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసినందున, దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని సిట్ బృందం ఈ మేరకు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. కాగా ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్ర ఉందని, ఆయన సొంత మండలంలో దాదాపు వంద మందికి ర్యాంకులు వచ్చాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు. దీంతో ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని తమకు అందజేయాల్సిందిగా సిట్ కోరింది. అయితే సిట్ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందించారు. సిట్ జారీ చేసిన నోటీసులు ఇంకా తనకు అందలేదని, అలాగే ఆ నోటీసుల్లో ఏముందో తనకు తెలియదని, నోటీసులు అందిన తర్వాత తాను స్పందిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − three =