రేపు తెలంగాణ కేబినెట్‌ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ?

CM KCR To Chair Telangana Cabinet Meeting Tomorrow at Pragathi Bhavan, CM KCR To Chair Telangana Cabinet Meeting Tomorrow, CM KCR To Chair Cabinet Meeting Tomorrow at Pragathi Bhavan, Telangana Cabinet Meeting, Pragathi Bhavan, CM KCR To Chair Cabinet Meeting, Paddy Procurement Issue, Telangana Paddy Procurement Issue, Paddy Procurement in Telangana, Telangana Paddy Procurement, Paddy Procurement, Paddy Procurement News, Paddy Procurement Latest News, Paddy Procurement Latest Updates, Paddy Procurement Live Updates, Telangana CM KCR, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Telangana, Mango News, Mango News Telugu,

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో రేపు (ఏప్రిల్ 12, మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ కేబినెట్ సమావేశంలో ధాన్యం అంశంపై కీలకంగా చర్చించే అవకాశమునట్టు తెలుస్తుంది. ముందుగా రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంపై కేంద్రంపై పోరులో భాగంగా నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా పెద్దస్థాయిలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్‌ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ధాన్యం సేక‌ర‌ణ‌పై ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్రానికి సీఎం కేసీఆర్ 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు. కేంద్రం స్పందన అనంతరం ఈ అంశంపై మరింత కార్యాచరణ దిశగా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే రాష్ట్రంలో తాజా పరిస్థితులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు సహా కీలక అంశాల‌పై కేబినెట్ లో చ‌ర్చించ‌నున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 7 =