తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ స్పెషల్ డ్రైవ్‌ వాయిదా

Covid Vaccination in Telangana : Second Dose Drive for Persons above 45 Years of Age Postponed,Mango News,Mango News Telugu,Covid Vaccination in Telangana,Vaccine Second Dose Drive Postponed,Vaccine Shortage,Telangana Suspends Second Dose,Vaccine Drive For Above 45 Years Postponed In Telangana,Telangana Pauses Second Dose Of Covaxin,Telangana Pauses Second Doses Of Covaxin For Above 45 Years,Telangana,Second Dose Of Covaxin Vaccination Postponed,Telangana News,Covaxin 2nd Dose Halted Over Shortage,Vaccination Halted For Two Days In Telangana,Hyderabad,Covid-19 Vaccination,Telangana Covaxin 2Nd Dose Halted Over Shortage,Second Dose Drive for above 45 Years of Age Postponed,Covid Vaccination,Covid Vaccine In Telangana,Telangana Second Dose Drive Postponed

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 45 ఏళ్లు పైబడిన వారికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ అందించేలా స్పెషల్ డ్రైవ్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ ను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. “సరిపడినంత కొవాక్జిన్ వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడం మరియు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి కొత్తగా రావాల్సిన వ్యాక్సిన్ డోసులు ఇంకా చేరని నేపథ్యంలో 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి రెండవ డోస్ వ్యాక్సిన్ ఇచ్చే డ్రైవ్ వాయిదా వేయబడింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ పునఃప్రారంభానికి సంబంధించిన వివరాలు త్వరలోనే అందుబాటులో ఉంచబడతాయి” అని పేర్కొన్నారు.

ముందుగా కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధిని 6-8 వారాల నుండి 12-16 వారాలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో కోవిన్ పోర్టల్‌లో మార్పులు చేయబడ్డాయి. ఈ మార్పులు దృష్ట్యా మే 15, శనివారం, మే 16, ఆదివారం నాడు కూడా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పక్రియను నిలిపివేశారు. తాజాగా సరిపడనంతగా వ్యాక్సిన్ డోసులు లేకపోవడంతో వాక్సినేషన్ డ్రైవ్‌ ను వాయిదావేస్తునట్టు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 20 =