కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ..

KCR election campaign schedule,KCR election campaign,KCR campaign schedule,election campaign,Mango News,Mango News Telugu,Telangana,KCR, Election,Campaign,schedule,54-meetings, 16 days meetings,KCR election campaign schedule,Telangana Chief Minister Kcr,Telangana CM Kcr,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,KCR Campaign Latest News,KCR campaign Latest Updates,KCR election campaign News Today
telangana,KCR, election,campaign,schedule, 54-meetings, 16-days meetings,KCR election campaign schedule,

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. సీఎం కేసీఆర్  తన ప్రచారంలో స్పీడును పెంచేశారు . ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ సాధించి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోన్నముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటికే ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొంటూ జనాల్లోకి దూసుకుపోతున్నారు. అయితే పోలింగ్ తేదీ దగ్గరపడుతుంటంతో.. కేసీఆర్ ఎన్నికల ఫైనల్ ప్రచార షెడ్యూల్ ను  ఖరారు చేసుకున్నారు.

 

ఈ నెల 13 నుంచి 28వ తేదీ వరకు ముఖ్యమంత్రి కేసీఆర్.. మొత్తం 16 రోజులలోనే 54 సభలలో పాల్గొనడానికి షెడ్యూల్ ఖరారు అయింది. 13వ తేదీన దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేటతో ప్రచారాన్ని ప్రారంభించనున్న గులాబీ బాస్ .. 28న వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, గజ్వేల్ సభలతో తన ప్రచారానికి ముగింపు పలకనున్నారు.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు 30 నియోజకవర్గాలలో ప్రజా ఆశీర్వాద సభలకు హాజరయ్యారు. ఇప్పుడు ఏకంగా 54 సభలకు హాజరుకానున్నారు. ఇక సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ప్రకారం..  నవంబర్ 13న దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట లలో, నవంబర్ 14వ తేదీన పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం సభలలో ప్రసంగిస్తారు. నవంబర్ 15న బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్ లలో  గులాబీ బాస్ ప్రచార సభలో పాల్గొంటారు.

 

16న ఆదిలాబాద్, బోద్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్ సభలలో పాల్గొననున్న సీఎం కేసీఆర్.. నవంబర్ 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల సభలలో  పాల్గొంటారు. నవంబర్ 18 వ తేదీన చేర్యాల, నవంబర్ 19 వ తేదీన ఆలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి సభల్లో సీఎం పాల్గొంటారు. నవంబర్ 20 వ తేదీన మానకొండూరు, స్టేషన్ ఘన్పూర్ , నకిరేకల్, నల్గొండ, నవంబర్ 21వ తేదీన మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట, 22న తాండూర్, కొడంగల్, మహబూబ్నగర్, పరిగి సభలకు హాజరుకానున్నారు.

 

అలాగే నవంబర్ 23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరు, 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలలో ప్రచార సభలలో పాల్గొంటారు. నవంబర్ 25న హైదరాబాదులో ప్రజా ఆశీర్వాద సభ లోను, 26న ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక లోను సీఎం కేసీఆర్ సభలలో పాల్గొననున్నారు. 27న షాద్ నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డిలలో, 28న వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, గజ్వేల్ లో ప్రజా ఆశీర్వాద సభలలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 19 =