ఖమ్మంలో లకారం చెరువుపై కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్

Minister KTR Tour in Khammam Inaugurates Cable Suspension Bridge and Several Development Programs, Minister KTR Inaugurates Cable Suspension Bridge and Several Development Programs, Telangana Minister KTR Inaugurates Cable Suspension Bridge and Several Development Programs, Minister KTR Inaugurates Cable Suspension Bridge, Minister KTR Launches Cable Suspension Bridge, Telangana Minister KTR Starts Cable Suspension Bridge, KTR Inaugurated Cable Suspension Bridge, Cable Suspension Bridge, Several Development Programs, Minister KTR Tour in Khammam, Minister KTR Khammam Tour, KTR Khammam Tour, Telangana Minister KTR Khammam Tour, Minister KTR Khammam Tour Newsw, Minister KTR Khammam Tour Latest News, Minister KTR Khammam Tour Latest Updates, Minister KTR Khammam Tour Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఖమ్మం నగరంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ఖమ్మం నగరంలోని లకారం చెరువుపై రూ.11.75 కోట్లతో నిర్మించిన కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటెన్, ఎల్ఈడి లైటింగ్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ గౌతమ్, అధికారులు, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అలాగే ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

రఘునాథపాలెంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సుడా పార్క్‌, బృహత్‌ పల్లె ప్రకృతి వనాన్ని, టేకులపల్లిలో 240 డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్లు, తెలంగాణ క్రీడా ప్రాంగణం, పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం పాత మున్సిపల్‌ భవన్ లో సిటి లైబ్రరీని, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జడ్పీ సెంటర్‌ వరకు నిర్మించిన కొత్తగా నిర్మించిన ఫుట్‌పాత్‌ ను, గట్టయ్య సెంటర్ లో కార్పోరేషన్ భవనం, దానవాయిగూడెంలో పారిశుధ్య వనరుల ఉద్యానవనం (ఎఫ్‌ఎస్టీపీ), ప్రకాశ్‌నగర్‌లోని వైకుంఠధామాన్ని ప్రారంభించనున్నారు.

ఇక శ్రీనివాస్‌నగర్‌లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ధంసలాపురం వద్ద ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన నర్సరీని ప్రారంభిస్తారు. కార్యక్రమాల ప్రారంభోత్సవం పూర్తయిన అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో భోజనం చేసి, మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం కానున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =