కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతోందా.. బీఆరెస్సా..!

In Telangana whick party is strong brs or congress,In Telangana whick party is strong,strong brs or congress,whick party is strong,brs or congress,brs, congress, telangana assembly elections, telangana politics,Mango News,Mango News Telugu,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,telangana assembly elections Latest News,telangana assembly elections Latest Updates,BRS Latest News,BRS Latest Updates
brs, congress, telangana assembly elections, telangana politics,

తాజాగా వెల్ల‌డైన‌ తెలంగాణ ఇంటెన్షన్స్ సర్వే కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉంద‌ని వెల్ల‌డించింది. ఏబీపీ సీ ఓట‌ర్ ఒపీనియ‌న్ పోల్ కూడా.. అధికార పార్టీకే ప‌ట్టం క‌ట్టింది. అంతేకాదు.. జనతా కా మూడ్‌ సంస్థ, మిషన్‌ చాణక్య‌, ఆత్మసాక్షి, నేషనల్‌ సెఫాలజీ ఇనిస్టిట్యూట్‌, ఇండియాటీవీ సీఎన్‌ఎక్స్‌, రాజనీతి   , మిషన్‌ తెలంగాణ పేరుతో ప్ర‌చారంలో ఉన్న  స‌ర్వేలు కూడా కేసీఆర్ స‌ర్కారే మ‌ళ్లీ రాబోతుంద‌న్న సంకేతాలు ఇస్తున్నాయి. కానీ.. న‌లుగురున్న చోట జ‌రుగుతున్న చ‌ర్చ‌ల్లో మాత్రం ఇద్ద‌రు కాంగ్రెస్ అంటున్నారు. ఈ క్ర‌మంలో రాజ‌కీయంగా  ఏం జ‌రుగుతోంది.. ఏం జ‌ర‌గ‌బోతోంది.. అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది. సర్వేల సంగతి అటుంచితే.. ప్ర‌చారంలో మాత్రం బీఆర్ ఎస్సే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

మ‌రోవైపు.. విప‌క్షాలు ఒంట‌రిగా బ‌రిలో దిగ‌డానికి ఆలోచిస్తున్నాయి. స్వతంత్రంగా తన కాళ్లపై తాను  నిలబడ్డ పరిస్థితి లేదు. కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ తప్ప కమ్యూనిస్టు పార్టీలు, జనసేనలే కాక జాతీయ పార్టీలుగా చెలామణి అవుతున్న  బీజేపీ కాంగ్రెస్‌లు సైతం పొత్తులపై ఆధారపడుతుండటం అందుకు  నిదర్శనం. సింహం సింగిల్‌గానే వస్తుందని కేటీఆర్ చెబుతున్నారు.. సింహం సంగతేమో కానీ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం స్వీయబలంతోనే ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమయ్యారు. ఆయన నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ ఒంట‌రిగా హ్యాట్రిక్ సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. పొత్తులు, భాగస్వామ్యాల వల్ల అంతిమంగా పొరపొచ్చాలే మిగులుతాయన్న దూరదృష్టితోనే కావచ్చు ఆయన  ఏ పార్టీతోనూ పొత్తుకు సిద్ధపడలేదు.

కాంగ్రెస్, బీజేపీలు ఇత‌ర పార్టీలతో సహ పొత్తులకో, సయోధ్యకో, మద్దుతుకో సిద్ధమవుతుండటం వెనుక తాము ఇప్ప‌టికీ బ‌లంగా లేమ‌ని వారు భావిస్తున్న‌ట్లుగా అర్థం చేసుకోవ‌చ్చు. అధికారంలోకి వచ్చేంత బలముందని చెప్పుకునే వారు నాలుగో ఐదో.. మహా అయితే మొత్తంగా పది సీట్ల బలం కోసం కూడా  పాకులాడుతుండటమే అందుకు నిద‌ర్శ‌నం. లేదా బ‌య‌ట జ‌రుగుతున్న చ‌ర్చ‌లో ఉన్న‌ట్లు నిజంగా  కాంగ్రెస్‌కు అధికారంలోకి వచ్చేంత బలం పెరుగుతుందా అంటే.. మరి అలాంటప్పుడు పొత్తుల కోసం ఎందుకు పాకులాడ‌తాయి. ఎట్టకేలకు  కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తు పొడిచింది. నెలల తరబడి మంతనాలు జరిపి, సాగదీసి అంతిమంగా సీపీఐ పొందింది, కాంగ్రెస్‌ వదులుకున్నది ఒక్క కొత్తగూడెం సీటు. ఇంతమాత్రం దానికి  సీపీఐ ఇంతకాలం ఆగడం.. కాంగ్రెస్‌ కరుణా కటాక్షాల కోసం వీక్షించడం ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తోంది.

ఇదేదో మొదట్లోనే ఒప్పుకొని ఉంటే రెండు పార్టీలకూ ఎంతో కొంత స‌మ‌యం,  అభ్యర్థికి ప్ర‌చారం కలిస వచ్చేవి. దీని వ‌ల్ల కొన్ని చోట్ల అయినా పుంజుకునే అవ‌కాశం క‌లిగిలేది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిశీలిస్తే కాంగ్రెస్ ఇంకా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. టికెట్ల కేటాయింపులో ఆచితూచి కొన్నిచోట్ల ఎంపిక స‌రైన ఫ‌లితాలే రాబ‌ట్ట‌వ‌చ్చు. కానీ.. వెలుగులోకి వ‌స్తున్న స‌ర్వేల‌న్నింటినీ కొట్టి పారేయ‌లేం. ఎక్కువ‌గా బీఆర్ ఎస్ వైపే ఉంటున్నాయి. ఈ క్ర‌మంలో గ‌తంతో పోలిస్తే కాంగ్రెస్ బ‌ల‌ప‌డిన‌ప్ప‌టికీ.. బీఆర్ ఎస్ ఇంకా బ‌లంగా ఉంద‌నే విష‌యాన్ని గుర్తించాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =