ప్రధాని మోదీతో జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేట‌ర్ల భేటీపై మంత్రి కేటీఆర్ ట్వీట్‌…గుజరాత్‌కు మాత్రమే నిధులా?

Minister KTR Tweeted about Meeting of GHMC BJP Corporators with PM Modi, Telangana Minister KTR Tweeted about Meeting of GHMC BJP Corporators with PM Modi, KTR Tweeted about Meeting of GHMC BJP Corporators with PM Modi, Meeting of GHMC BJP Corporators with PM Modi, GHMC BJP Corporators Meeting with PM Modi, PM Modi, GHMC BJP Corporators Meeting, GHMC BJP Corporators Meeting News, GHMC BJP Corporators Meeting Latest News, GHMC BJP Corporators Meeting Latest Updates, GHMC BJP Corporators Meeting Live Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు ఢిల్లీలో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “జీహెచ్‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్లను, తెలంగాణకు చెందిన ఇతర పార్టీ నేతలను కలిశాను. కమ్యూనిటీ సేవా ప్రయత్నాలపై దృష్టి పెట్టడం మరియు అట్టడుగు స్థాయి ప్రజలకు ఎలా సహాయపడాలనే దానిపై మేము విస్తృత చర్చలు చేసాము. తెలంగాణలో సుపరిపాలన కోసం మరియు వంశపారంపర్య దుష్టపాలనకు ముగింపు పలికేందుకు బీజేపీ కృషి చేస్తుంది” అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ పై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.

గుజరాత్‌కు మాత్రమే నిధులా?:

మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ, మోడీ జీ, సమాజ సేవ ప్రయత్నాలేనా?, మీరు గవర్నమెంట్ లేదా ఎన్జీవో నడుపుతున్నారా? అని అడిగారు. “హైదరాబాద్ వరద సహాయ నిధులపై ఏమైనా అప్‌డేట్ ఉందా?, మూసీ పునరుజ్జీవనం లేదా హైదరాబాద్ మెట్రో పొడిగింపు కోసం ఏదైనా ఆర్ధిక సహకారం ఉందా? ఐటీఐఆర్‌పై ఏదైనా అప్‌డేట్ ఉందా?, హైదరాబాద్/తెలంగాణ కోసం కేవలం పెదవిపై వచ్చే మాటలేనా?, గుజరాత్‌కు మాత్రమే నిధులా?” అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + two =