ముగిసిన మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన.. పది రంగాల్లో భారీ పెట్టుబడులు, 42,000 ఉద్యోగాల రూపకల్పన

Minister KTR Two Week Visit of UK and US Completed Likely to 42000 Jobs by Huge Investments in Telangana,Minister KTR Two Week Visit of UK,US Completed Likely to 42000 Jobs by Huge Investments,42000 Jobs by Huge Investments in Telangana,UK and US Investments in Telangana,Mango News,Mango News Telugu,Investments in Telangana,KTR wraps up US,Investment commitments during US,KTRs trip to UK and US fetches mega investments,Kalvakuntla Taraka Rama Rao,Minister KTR Latest News,Minister KTR Latest Updates,Telangana Investments News Today

తెలంగాణకు పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చేపట్టిన యూకే, అమెరికా దేశాల పర్యటన ముగిసింది. రెండు వారాల పర్యటనలో భాగంగా ఆయన ఈ రెండు దేశాలలో అనేక కంపెనీల యాజమాన్యాలతో, పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను వారికి వివరించి ఆయా సంస్థల విస్తరణకు రాష్ట్రాన్ని రెండవ గమ్యస్థానంగా చేసుకునేలా చేయడంలో మంత్రి కేటీఆర్‌ సఫలీకృతులయ్యారు. ఈ క్రమంలో 80కి పైగా బిజినెస్‌ సమావేశాలు, వివిధ అంశాలపై 5 రౌండ్‌ టేబుల్‌ సమావేశాలలో పాల్గొన్న ఆయన.. రెండు ప్రపంచ సదస్సుల్లో ప్రసంగించి తెలంగాణ రాష్ట్ర ప్రగతి, ఇక్కడి వ్యాపార అవకాశాలను ప్రపంచానికి తెలియజేశారు. తద్వారా ప్రత్యక్షంగా 42 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల రూపకల్పన చేశారు. అలాగే పరోక్షంగా దీనికి మూడు రెట్లు ఉపాధి లభించేలా కృషి చేశారు.

ఇక తొలుత యూకేలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌ లండన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ‘ఐడియాస్‌ ఫర్‌ ఇండియా’ అంశంపై ఈ నెల 12న లండన్‌లో నిర్వహించిన సదస్సులో పాల్గొని, తెలంగాణ చేపట్టిన వివిధ పథకాల గురించి వివరించారు. అలాగే లండన్‌లో భారత హైకమిషనర్‌ ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. పలు ప్రతిష్టాత్మక కంపెనీలు కూడా హాజరైన ఈ సమావేశంలో గత తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని తెలియజేశారు. అనంతరం అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన న్యూయార్క్‌, వాషింగ్టన్‌ డీసీ, హ్యూస్టన్‌, హెండర్సన్‌, బూస్టన్‌ తదితర నగరాల్లో పర్యటించారు. ఈ క్రమంలో అనేక దిగ్గజ సంస్థలతో భేటీ అయ్యి.. బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సేవలు, బీమా రంగం) ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, ఐటీ, ఐటీఈఎస్‌, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ డివైజెస్‌, డిజిటల్‌ సొల్యూషన్స్‌, ఇన్నోవేషన్‌, డాటా సెంటర్స్‌, ఆటోమోటివ్‌ అండ్‌ ఈవీ తదితర రంగాలలో రాష్ట్రానికి పెట్టుబడులను తెచ్చేలా కృషి చేశారు.

మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా.. ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన అనేక దిగ్గజ కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. వీటిలో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ మీడియా సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌, డిస్కవరీ, ఆరోగ్య సంరక్షణ సాంకేతికత దిగ్గజం మెడ్‌ట్రానిక్‌, ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ స్టేట్‌ స్ట్రీట్‌, బెయిన్‌ క్యాపిటల్‌కు చెందిన వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌, లండన్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ గ్రూప్‌, స్పోర్ట్స్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌లో ప్రపంచ దిగ్గజ సంస్థ డీఏజెడ్‌ఎన్‌, ఫ్రెంచ్‌ అమెరికన్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ దిగ్గజ సంస్థ టెక్‌నిప్‌ ఎఫ్‌ఎంసీ, ప్రపంచ ఫైనాన్స్‌ సేవల సంస్థ అలియంట్‌ గ్రూప్‌, మూలకణ చికిత్సకు సంబంధించిన స్టెమ్‌క్యూర్స్‌, ప్రముఖ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ కంపెనీ మోండీ, ఇంజినీరింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ జాప్‌కామ్‌ తదితర మేటి సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ తెలంగాణలో భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేశాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + sixteen =