సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

Colonel Santosh Babu, Colonel Santosh Babu Statue, KTR Unveiled Martyr Colonel Santosh Babu Statue, KTR Unveiled Martyr Colonel Santosh Babu Statue at Suryapet, Mango News, Martyr Colonel Santosh Babu, Martyr Colonel Santosh Babu Statue, Martyr Colonel Santosh Babu Statue at Suryapet, Minister KTR, Minister KTR Unveiled Martyr Colonel Santosh Babu Statue, Minister KTR Unveiled Martyr Colonel Santosh Babu Statue at Suryapet, One year of Galwan valley clash, Suryapet

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కల్నల్ సంతోష్‌ బాబు కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. గత సంవత్సరం జూన్ 15న భారత్‌-చైనా సరిహద్దుల్లో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కర్నల్ ‌బిక్కుమల్ల సంతోష్‌ బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

ఆ క్రమంలో సంతోష్‌బాబు స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉండేలా సూర్యాపేటలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు సూర్యాపేట కోర్టు చౌరస్తాలో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంతోష్‌ బాబు ప్రథమవర్థంతి సందర్భంగా మంగళవారంనాడు మంత్రి కేటీఆర్ సంతోష్‌ బాబు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, సంతోష్ బాబు కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 3 =